విశాఖ భూ దందా అంటే ఏపీతో పాటు జాతీయ స్థాయిలోనూ ఒక మోత మోగించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణం జరిగింది అని నాడు విపక్షంలోని వైసీపీ సహా అన్ని పార్టీలు ఆందోళన చేశాయి. దాని మీద నాటి సీఎం చంద్రబాబు ఒక సిట్ ని ఏర్పాటు చేశారు.
ఆ సిట్ కి నాటి టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెళ్ళి మరీ ఫిర్యాదు చేసి వచ్చారు. ఆ సిట్ నివేదిక ఇచ్చినా నాటి సీఎం దాన్ని బయటపెట్టలేదు ఇక 2019లో జగన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కొత్త సిట్ ని వేశారు నిజానికి తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు సర్కార్ వేసిన సిట్ ఇచ్చిన నివేదిక బయటపెడతామని వైసీపీ నేతలు చెపారు.
కానీ దాన్ని పక్కన పెట్టి సిట్ ని వేసి రెండేళ్ల పాటు విచారణ జరిపించారు. మరి ఆ సిట్ విచారణ ఏమిటో ఆ నివేదిక ఏమైందో వైసీపీ నేతలు చెప్పడంలేదు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక వందలాది ఎకరాలు భూ దందా అయ్యాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని తగిన విచారణ జరిపిస్తామని చెబుతున్నారు.
అంతా బాగానే ఉంది కానీ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు రెండు సిట్ ల ఏర్పాటు చేసి ఏమి తేల్చారు అన్నదే ప్రజలకు అర్ధం కాకుండా ఉంది మరి. వారి మీద వీరు వీరి మీద వారు అవే ఆరోపణలు చేసుకుంటూ పొద్దు పుచ్చుతున్నారు తప్ప సిట్ నివేదిక ఏమైందో బయటపెట్టరు. అదే విధంగా ఈ రోజు వరకూ చూస్తే భూములు ఎవరు కాజేశారో చెప్పారు. ఇదొక టీవీ శీరియల్ మాదిరిగా సాగిపోతూనే ఉంది.
ఇక మరో వైపు చూస్తే అమరావతిలో టీడీపీ అతి పెద్ద భూ దందా చేసింది అని దాని మీద సిట్ విచారణ చేస్తే అసలు నిజాలు బయటపడతాయని వైసీపీ మంత్రులు సీనియర్ నేతలు అంటున్నారు. అమరవతి రాజధాని భూముల విషయంలో దందా జరిగితే బయటకు తీయాల్సిందే. అదే సమయంలో విశాఖలోనూ భూ దందా జరిగిందని కుడి ఎడమ తేడా లేకుండా అన్ని పార్టీ అంటున్నాయి కదా. మరి దీని మీద సిట్ ఏమి చెప్పింది అన్నది ప్రజలకు ఎందుకు చెప్పరు బాధ్యుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు అన్నదే మేధావులు ప్రజా సంఘాల నుంచి వస్తున్న సూటి ప్రశ్న.
ఇక నాడు భూ దందాలో సంబంధం ఉందని కొందరు టీడీపీ నేతల పేర్లు వైసీపీ నేతలు చెప్పుకొస్తూ వచ్చారు. ఆ నేతలు గత నాలుగేళ్ళుగా ఈ సిట్ నివేదిక ఎక్కడ బయటపెడతారో అని టీడీపీ కార్యక్రమాలకు కూడా హాజరు కాకుండా తెర వెనక ఉండిపోయారని ఆరోపణలు ఉన్నాయి. ఇపుడు వారు మీడియా ముందుకు వచ్చి వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. మరి సిట్ నివేదిక అంతా ఉత్తుత్తిదేనా. ఆరోపణలు కూడా అవాస్తవాలా లేకపోతే ఏ ఒక్క నేత మీద ఎందుకు చర్యలు లేవు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఎవరి హస్తం ఉన్నా కూడా సిట్ నివేదిక ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సిందే అని అంతా కోరుతున్నారు. మరి అమరావతి రాజధాని భూముల విషయంలో సిట్ విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వేళ సహజంగా విశాఖ భూ దందా మీద సిట్ నివేదిక కోసం డిమాండ్ వస్తోంది. దీంతో ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు.