ఎంత చెప్పినా.. ఎన్నిసార్లు చెప్పినా.. భారత క్రికెట్ లో ఇప్పటికీ హాట్ టాపిక్ ఏమిటంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మధ్య విభేదాలు నెలకొన్నాయా? అనే. అలాంటిదేమీ లేదని విరాట్ అంటాడు. రోహిత్ మాత్రం పెద్దగా పెదవి విప్పడు. బీసీసీఐ ఏమీ మాట్లాడదు. జట్టులో వాతావరణం మాత్రం కొంత తేడాగా కనిపిస్తుంది. టీమిండియాలో నెలకొన్న ఈ పరిణామాలపై కొంతకాలంగా అనేక రకాల ప్రచారం జరిగింది.
ఈ ఊహాగానాలు ఇప్పటివి కాదు.. 2019 ప్రపంచ కప్ నాటి నుంచే వస్తున్నాయి. వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ అభిప్రాయాలను గౌరవించలేదని, జట్టు ఎంపికలో కోహ్లి మాటే నెగ్గిందని ప్రచారం జరిగింది. ఇవి ఎంతవరకు నిజమో కానీ, అప్పటి నుంచి అభిమానుల మధ్య అనుమానాలు మరింత పెరిగాయి.
అయితే, మైదానంలో మాత్రం ఈ ఇద్దరు గొప్ప బ్యాట్స్ మన్ లను చూస్తే అసలు విభేదాలున్నట్లు కనిపించదు. మొత్తానికి ఈ వివాదం ఇటీవలి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ తో మరింత మలుపు తిరిగింది. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత.. బీసీసీఐ, టీమిండియాలోని కొందరు ఆటగాళ్లతో అతడికి విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఇప్పుడు చేతన్ శర్మ ఏమంటాడంటే జట్టు ఎంపికలో సెలక్టర్లదే నిర్ణయం. కెప్టెన్ ,కోచ్ అభిప్రాయం కోరతారు. మైదానంలో దిగే జట్టును ఖరారు చేసేది మాత్రం కోచ్, కెప్టెన్, వైస్ కెప్టెన్ లతో కూడిన టీం మేనేజ్ మెంట్.
బీసీసీఐ మిగతా అన్ని విషయాలను చూసుకుంటుంది. కాగా, విభేదాలు లాంటి పెద్ద సమస్యలు వస్తే నేరుగా జోక్యం చేసుకుంటుంది. క్రమశిక్షణ విషయంలో బీసీసీఐ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వినోద్ కాంబ్లీ నుంచి నిన్న మొన్నటి శ్రీశాంత్ వరకు ఎందరినో పక్కనపెట్టింది. అజహరుద్దీన్, అజయ్ జడేజా వంటివారిపైనే చర్యలు తీసుకుంది. అలాంటింది రోహిత్ -కోహ్లి మధ్య విభేదాలను చూస్తూ ఊరుకుంటుందా? అసలే అక్కడ అధ్యక్షుడిగా ఉన్నది సౌరభ్ గంగూలీ.
కాబట్టి రోహిత్-కోహ్లి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా? అని అంటే ఏమీ చెప్పలేం. ఇప్పడు ఇదే విషయమై స్పందించారు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ. కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆయన.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.. అవన్నీ పనిలేని వ్యక్తులు పుట్టించే పుకార్లు మాత్రమేనని అభిప్రాయడ్డారు. ‘‘విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని మేం కోరాం.. అయితే అతను మా మాట వినిపించుకోలేదన్న ఆయన.. వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో వన్డే ఫార్మాట్ బాధ్యతలు కూడా రోహిత్ శర్మకు అప్పగించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
రోహిత్, కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలు, వైరం లేదు.. ఇలాంటి వార్తలన్నీ చూసి మేం నవ్వుకుంటూ ఉంటాం.. వారిద్దరూ ఓ ఫ్యామిలీలా ఉంటారని స్పష్టం చేశారు. భవిష్యత్తు గురించి, రాబోయే ఐసీసీ టోర్నీల గురించి కూడా వాళ్లిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు జట్టులో వాతావరణం చాలా బాగుంది’’అని తెలిపారు చేతన్ శర్మ.