విశాఖ జిల్లాలో ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసులో ఘోరాలు బయటపడ్డాయి. శిరోముండనం చేయించేముందు అసలేం జరిగిందని సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. పోలీసులు అసలేం జరిగిందని వివరించారు.
సినీ నిర్మాత నూతన్ నాయుడు భార్య నర్సింగి ప్రియమాధురి ఈ ఘాతుకానికి కేంద్ర బిందువు అని తేల్చారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ (19) పెందుర్తి సుజాతానగర్ లోని నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో హౌస్ కీపింగ్ పని చేసేవాడు. ఈనెల 1వ తేదీన జీతం తీసుకొని నూతన్ భార్య ప్రియమాధురికి చెప్పి ఉద్యోగం మానేశాడు.
అయితే రెండు రోజుల క్రితం శ్రీకాంత్ కు ప్రియమాధురి ఫోన్ చేసి ఇంట్లో ఐఫోన్ పోయిందని.. మాట్లాడేందుకు రావాలని పిలిపించారు. శ్రీకాంత్ వెళ్లగా .. నువ్వే ఐఫోన్ దొంగిలించావంటూ ఇవ్వాలని నూతన్ భార్య డిమాండ్ చేసింది. తాను ఫోన్ తీయలేదని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిజం తెలుస్తుందని శ్రీకాంత్ చెప్పి వెళ్లిపోయాడు. మరునాడు మరోసారి శ్రీకాంత్ ను పిలిపించిన ప్రియమాధురి తోపాటు ఇంట్లో ఉన్న హౌస్ కీపర్ ఇందిరారాణి కర్ర, ఇనుపచువ్వతో కొట్టారు. శ్రీకాంత్ చేతులెత్తి వేడుకున్నా కనికరించలేదు. దీంతో క్షురకుడు శ్రీకాంత్ ను పిలిపించి గుండు కొట్టించారు. శ్రీకాంత్ చుట్టూ చేరి సెల్ఫీలు దిగారు.
తప్పించుకున్న శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాలతో పోలీసులు నూతన్ ఇంట్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. బాధితుడిని ఆస్పత్రికి పంపించి చికిత్స చేశారు. ఈ వ్యవహారంలో నూతన్ భార్య ప్రియమాధురితోపాటు ఇంట్లో పనిచేసే ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారంతా సహకరించారని నిర్ధారించారు.