2 గంటల అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్..జగన్ వాదనలు ఏమిటి?

Update: 2020-10-07 06:00 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న జల వివాదాల విషయంలో లెక్కలు తేల్చుకోవటానికి వీలుగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ నుంచి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. దేశ రాజధాని నుంచి కేంద్రమంత్రి గజేంద్ర పాల్గొన్నారు. రెండు గంటల పాటు సాగిన సమావేశం హాట్ హాట్ గా సాగినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా తమ వాదనల్ని ఇద్దరు ముఖ్యమంత్రులు వినిపించారు. పలు సందర్భాల్లో ఇద్దరి మధ్య వాదనలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. దీంతో వాతావరణం హాట్ హాట్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదనల్ని అడ్డుకుంటూ..వారిద్దరికి కేంద్రమంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘ఈ పద్దతేం బాగోలేదు. ఇలా అయితే ఎలా ముందుకు ఎలా వెళతాం’’ అన్న మాట కూడా వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇంతకీ రెండు గంటల భేటీలో కేసీఆర్.. జగన్ ల వాదనలు ఏమిటి? వారేం విషయాల్ని ప్రస్తావించారు అన్నది చూస్తే..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాదన..
-  పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు ఏ అనుమతులూ లేవు. దాని సామర్థ్యం పెంచటం ఏమిటి?
-  కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు నది బేసిన్ లో ఉంది
- రాయలసీమ ప్రాజెక్టు ద్వారా నది బేసిన్ బయటికి నీళ్లు తరలిస్తున్నారు.
-  ఇలా అయితే.. మేం కూడా జూరాల దిగువలో భారీ బ్యారేజీని నిర్మించి.. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోస్తాం
-  ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పుడు పరిధిని ఖరారు చేస్తే ఏం లాభం?
-  గోదావరి బేసిన్‌లో జల వివాదాల పరిష్కారం, నీటి కేటాయింపుల కోసం కొత్తగా ట్రైబ్యునల్‌ పై ఏర్పాటుకు సంబంధించిన వినతుల్ని మేం రేపే పంపుతాం.
-  ట్రైబ్యునల్ ఏర్పాటుకు కేసులు ఏమీ ఉండకూడదు. కోర్టులో ఉన్న కేసుల్ని మేం ఉపసంహరించుకుంటాం
-  పాలమూరు-రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం మూడో టిఎంసీ, సీతారామ వంటి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పిస్తాం.
-  ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయకుండా మీరేం చేసినా వృథానే. అన్ని సమస్యలకు ట్రైబ్యునళ్ల ఏర్పాటే పరిష్కారం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-  అనుమతులు లేకుండానే గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారు
-  సీతారామ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులకు అనుమతులు లేవు.
-  మాకో న్యాయం తెలంగాణ వాళ్లకో న్యాయమా?
-  తెలంగాణకు ఏ నిబంధన వర్తిస్తుందో మాకూ అదే వర్తించే చేయాలి.
-  రాయలసీమ లిప్టుతో పాటు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను కేంద్రానికి ఇస్తాం.
-  శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులతోపాటు కృష్ణానదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులనూ కేంద్రమే స్వాధీనం చేసుకుని వాటిని నిర్వహించాలి.
-  శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 841 అడుగులకు తగ్గితే రాయలసీమ, నెల్లూరు జిల్లాల దాహార్తిని తీర్చలేని పరిస్థితి. అందుకే రాయలసీమ ఎత్తిపోతలను ప్రారంభించాం.
-  శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం.. సాగర్ కుడి కాలువను ఆంధ్రకు స్వాధీనం చేయాలి
Tags:    

Similar News