ఇపుడు అందరి కళ్ళు గురువారం జరగబోతున్న ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలపైనే ఉంది. ఉదయం 9 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే కౌంటింగ్ కూడా మొదలైపోతుంది. భర్తీ కావాల్సిన ఏడు స్ధానాలకు 8 మంది పోటీ చేస్తున్నారు. ఎంఎల్ఏల బలాన్ని బట్టి వైసీపీ ఏడు స్ధానాలను గెలుచుకునే అవకాశముంది. గెలుపు అవకాశాలు లేకపోయినా టీడీపీ పోటీలోకి దిగటంతో పోటీ అనివార్యమైపోయింది.
ఒక్కో ఎంఎల్సీ అభ్యర్థికి 22 మంది ఎంఎల్ఏల ఓట్లు కావాలి. ఈ లెక్కప్రకారం టీడీపీకి ఉన్నది 19 మంది ఎంఎల్ఏలే. కాబట్టి కచ్చితంగా క్రాస్ ఓటింగ్ పైన ఆశలు పెట్టుకునే పోటీలోకి దిగినట్లు అర్ధమైపోతోంది. అయితే టీడీపీ అనుకుంటున్నట్లు వైసీపీ తరఫున అవసరమైన క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అన్న విషయమే ఉత్కంఠను రేపుతోంది. ఇక్కడ అందరికీ కనిపిస్తున్నది రెబల్ ఎంఎల్ఏలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మాత్రమే.
ఇపుడు రెండుపార్టీల్లోను చర్చంతా వీళ్ళిద్దరి పైనే జరుగుతోంది. కాబట్టి వీళ్ళిద్దరి ముందున్న ఆప్షన్లు ఏమిటో చూద్దాం. వీళ్ళకి నాలుగు ఆప్షన్లున్నాయి. మొదటిదేమో వైసీపీ అభ్యర్ధులకే ఓట్లేయటం.
రెండోది టీడీపీ అభ్యర్ధికి వేయటం. మూడో ఆప్షన్ ఏమిటంటే ఓటింగ్ నుండి గైర్హాజరవ్వటం, నాలుగోదేమిటంటే తమ ఓట్లను చెల్లకుండా చేసుకోవటం. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారమైతే ఇద్దరు ఓటింగ్ నుండి గైర్హాజరయ్యేందుకు లేదా ఓట్లు చెల్లకుండా చేసుకునేందుకే ఎక్కువ అవకాశాలున్నాయట.
ఇదే సమయంలో రెబల్ ఎంఎల్ఏలిద్దరు కచ్చితంగా తమకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేస్తారని తమ్ముళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీకి అనుకూలంగా ఓట్లేసిన తర్వాత రెబల్ ఎంఎల్ఏలిద్దరు వైసీపీలో ఉండలేరు.
అందుకనే వీళ్ళ ఓటింగ్ పై పార్టీల్లో ఎంత టెన్షన్ పెరిగిపోతోందో వ్యక్తిగతంగా వీళ్ళకి అంతకుమించిన టెన్షనే ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే వీళ్ళిద్దరి ఓట్లుతో పాటు మరో ఓటు కూడా పడితేనే టీడీపీ గెలుస్తుంది. మూడో ఓటు తెచ్చుకోకుండా రెబల్ ఎంఎల్ఏల ఓట్లు వేయించుకున్నా ఎలాంటి ఉపయోగముండదు. కాబట్టి ఇపుడా మూడో ఓటుపైన కూడా టెన్షన్ పెరిగిపోతోంది.