రాజకీయాల్లో సక్సెస్ అన్నది వ్యూహాల మీదనే ఆధాపడి ఉంటుంది. దాంతో పాటు టైమింగ్ కూడా ముఖ్యం. ఈ రెండూ ఉన్న వారే స్పీడ్ గా ఫ్రంట్ లైన్ లోకి వచ్చేస్తారు. తెలుగు రాజకీయాలలో చూసుకుంటే ఇద్దరు చంద్రులు ఇపుడు జాతీయ రాజకీయాల మీద ఒక చూపు చూడాలని భావిస్తున్న వారే. చంద్రబాబు అయితే పాత కాపు. ఆయనకు జాతీయ రాజకీయాల్లో ఎంతో ప్రవేశం, అనుభవం ఉన్నాయి. ఆయనది జాతీయ రాజకీయ తెర మీద పాతికేళ్ళ చరిత్ర.
సరిగ్గా ఇప్పటికి 26 ఏళ్ల క్రితం దేవేగౌడాని ప్రధానిగా చేస్తూ యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసిన హిస్టరీ బాబు సొంతం. ఆ తరువాత బీజేపీకి అనూహ్యంగా మద్దతు ఇచ్చి వాజ్ పేయ్ ప్రధాని కావడానికి మార్గం సుగమం చేసిన చరిత్ర కూడా బాబుదే. 2004లో ఉమ్మడి ఏపీలో ఓడిపోయాక బాబు జాతీయ రాజకీయాల మీద చూపు మార్చుకున్నారు.
అయితే విభజన ఏపీలో అధికారంలోకి వచ్చాక ఎన్డీయే కూటమిలో చేరారు. కన్వీనర్ గా కూడా ఉన్నారు. అయితే 2018లో బీజేపీకి తలాక్ అనేశాక బాబు మళ్ళీ యాంటీ మోడీ స్టాండ్ తో దేశమంతా తిరిగారు. 2019 ఎన్నికలో ఆయన మోడీని ఓడించాలని, కాంగ్రెస్ నేతృత్వంలో కూటమికి అధికారం దక్కేలా చూడాలని చాలానే అనుకున్నారు.
కానీ నాడు మోడీ వేవ్ లో అంతా తల్లకిందులు అయింది. ఏపీలో కూడా బాబుకి ఘోర పరాజయం ఎదురైంది. దాంతో ఆయన తిరిగి బీజేపీతో స్నేహానికి చూస్తున్నారు. అంతే కాదు ఆయన జాతీయ రాజకీయాల ఊసు కూడా మానుకున్నారు. అయితే బాబు ఆలోచనలు ఇపుడు మారుతున్నాయి. బీజేపీకి ఎంతలా సానుకూల సంకేతాలు పంపుతున్నా తిరిగి టీడీపీ వైపు చూడడం లేదు.
దాంతో పాటు దేశంలో మోడీ ఇమేజ్ నానాటికీ తగ్గుముఖం పడుతోంది. దాంతో ఉత్తరాది ఎన్నికల తరువాత మరోసారి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని బాబు తలపోస్తున్నారని టాక్. ఇలా బాబు ఆలోచనల్లో ఉండగానే కేసీయార్ మాత్రం రెడీ అంటూ సడెన్ గా దూకేశారు. ఆయన ఇపుడు మోడీని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు.
అంతే కాదు, అవసరం అయితే దేశంలో కొత్తగా జాతీయ పార్టీని పెడతాను అని కూడా అంటున్నారు. తనకు బీజేపీయేతర సీఎంల నుంచి ఫోన్లు వస్తున్నాయని, తొందరలోనే ముంబై వెళ్లి మోడీ యాంటీ కూటమికి సన్నాహాలు చేస్తానని చెబుతున్నారు. తనకు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు టచ్ లో ఉన్నారని కూడా కేసీయార్ అంటున్నారు.
ఇక జాతీయ స్థాయిలో కేసీయార్ ఇలా బిగ్ సౌండ్ చేయడంతో మిగిలిన నాయకులు కూడా ఆయన వైపు చూస్తున్నారు. ఒక విధంగా తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ శంఖం పూరించిన నేతగా కేసీయార్ ఉన్నారు ఇక్కడే బాబు ప్లాన్ కి కేసీయార్ అడ్డు తగిలారా అన్న చర్చ వస్తోంది. బాబు సైతం జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఆయన ముహూర్తం కోసం చూస్తూంటే కేసీయార్ సీన్ లోకి దిగిపోయారు. మరి కేసీయార్ ఇలా దూకుడు చేయడం ఒక విధంగా బాబుకు ఇబ్బందికరమే.
ఇక ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే మోడీ అమిత్ షా సైకిల్ పార్టీ వైపు చూడకపోతే చంద్రబాబుకు రెండిందాల ఇబ్బందిగానే ఉంటుంది. అయినా అపర చాణక్యుడు కాబట్టి బాబు కాస్తా లేట్ గా అయినా లేటెస్ట్ గా మాస్టర్ ప్లాన్ రెడీ చేసే ఉంటారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరు చంద్రుల రాజకీయం జాతీయమా. లేక ప్రాంతీయమా అన్నది తొందరలోనే తేలన