వ్రతం చెడ్డా ఫలితం దక్కని వైనంగా మారిందట పవన్ కళ్యాణ్ పరిస్థితి. బీజేపీ కోరిక మేరకు మద్దతిచ్చాడు. కానీ ఆ పార్టీపై పవన్ కళ్యాణ్ నమ్మకం ఉంచలేదు. అదే ఇప్పుడు ఆయన పరపతిని తగ్గించిందట..
దుబ్బాకలో బీజేపీకి మద్దతిచ్చిన పవన్ అక్కడ ప్రచారం చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే బీజేపీపై నమ్మకం లేక.. కేసీఆర్ కు ఎదురు వెళ్లలేక పవన్ వెనక్కి తగ్గాడో తెలియదు కానీ ఆ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేదు.
ఇక హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పోటీచేస్తానని పవన్ ప్రకటించారు. బీజేపీ పెద్దలు వచ్చి సర్ధిచెప్పడంతో అభ్యర్థులను వెనక్కి తీసుకొని మద్దతు పలికారు. అయితే గత నవంబర్ 28,29 తేదీల్లో పవన్ ప్రచారం చేస్తారని ప్రకటించారు. కానీ ఎందుకో వెనక్కితగ్గాడు. గ్రేటర్ లో పవన్ ఎందుకు ప్రచారం చేయలేదో ఎవరికి తెలియదు.
అయితే గ్రేటర్ లోనూ బీజేపీ గెలవడంతో పవన్ డిఫెన్స్ లో పడ్డాడు. కాసింత తిరిగి ప్రచారం చేసినా ఆ క్రెడిట్ పవన్ ఖాతాలో పడేది. కానీ దాన్ని కూడా పవన్ మిస్ చేసుకున్నాడు. మంచి అవకాశాలను పవన్ కాలదన్నాడని జనసైనికులు బాధపడుతున్నారట. ఈ రెండు చాన్సులు వినియోగించుకుంటే పవన్ కు క్రేజ్ వచ్చేదని అంటున్నారు.