శృంగారంపై ఆందోళనకు కారణాలేంటి?

Update: 2021-07-24 09:30 GMT
తొలి సారి శృంగారంలో పాల్గొనేవారికి బోలెడు సందేహాలుంటాయి. తాను సమర్థుడినేనా? ఎక్కువ సేపు కార్యం చేయగలనా? తొందరగా అయిపోతుందా? భాగస్వామిని సంతృప్తి పరచగలనా? అన్న సందేహాలు బోలెడు ఉంటాయి. ఫస్ట్ నైట్ విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలకు ఇద్దరికీ తొలి రోజుల్లో ఏమాత్రం స్పష్టత ఉండదట..

పెళ్లికి ముందు అబ్బాయిలు రోమాన్స్ లో రెచ్చిపోవాలని తహతహలాడుతుంటారు. ఏవేవో కలలుగంటారు. ఇక పెళ్లి తర్వాత ఆ కార్యంలో ఆత్రుతగా పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు. అక్కడే తప్పులో కాలేస్తారు. తమ పార్ట్ నర్ సుఖపెడుతామో లేదో? తనకు ఆ అనుభూతి కలుగుతుందో లేదో అని ఏవేవో భయాలు వెంటాడుతాయి.

యవ్వనంలో తొలిసారి ఆ కార్యంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. సరిగ్గా సమయం వచ్చేసరికి టెన్షన్ పడుతుంటారు. వారికి తెలియకుండా ఒత్తిడికి గురవుతుంటారు. పార్ట్ నర్ సహకరిస్తుందా లేదా అని ఆందోళన చెందుతారు.

అలాంటి వారు ముందుగా కార్యంలోకి వెళ్లకుండా భాగస్వామితో మాట్లాడాలి. రోమాంటిక్ గా చేష్టలు చేయాలి.. కొద్దిసేపు ప్రేమ కురిపించాలి. ఆమె చేరువయ్యాక.. ఫ్రీగా మారాక ఆ కార్యం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. సరదాగా ఉండాలని సూచిస్తున్నారు. అది మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరిగి బంధాన్ని ధృడం చేస్తుందంటున్నారు. భాగస్వామికి ఏ విధంగా చేస్తుందో నచ్చుతుందో గమనించి ఫోర్ ప్లే చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ఇక భాగస్వామిని శృంగారంలో రెచ్చగొట్టాలంటే లోదుస్తులు మోడ్రన్ వి వేసుకోవాలని.. దుస్తుల్లో చీరలు, ఇతర మోడ్రన్ రెచ్చగొట్టేవే వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక భాగస్వామని పొగడడం అత్యంత అవసరం. దీంతో ఒత్తిడి, టెన్షన్ తగ్గిపోయి కలయికలో పాల్గొనే కార్యంలో ఆనందం పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.





Tags:    

Similar News