తిరుమల ఆనంద నిలయాన్ని పోస్టు చేసిన వ్యక్తిని టీటీడీ ఏం చేసింది?

Update: 2023-05-08 17:02 GMT
తిరుమల భద్రత మీద బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. తరచూ ఏదో ఒక అంశం బయటకు రావటం తెలిసిందే. ఇటీవల ఆనంద నిలయం సీన్లను షూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైనం సంచలనంగా మారింది. అలా ఎలా జరిగింది? అన్నది ప్రశ్నగా మారింది. స్వామివారికి జరిగిన అపచారం మీద పలువురు మండిపడ్డారు.

అసలు.. స్వామి వారి ఆలయంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా వెళ్లాయి? వీడియోలు చిత్రీకరించటం ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్నకు తాజాగా టీటీడీ చీఫ్ విజిలెన్సు అండ్ సెక్యురిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ సమాధానం చెప్పారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఆలయంలోకి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అనుమతించరు. తిరుమల ఆనంద నిలయంలోని సీన్ల ను షూట్ చేయటం చట్ట ప్రకారం నేరం కూడా.

ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతోకూడిన వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం చోటు చేసుకుంది. ఆ సమయంలో భక్తులు తీసుకెళ్లిన పెన్ కెమెరాతో వీడియోను షూట్ చేసినట్లుగా అనుమానిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే ఈ దరిద్రపు గొట్టు పని చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. ఏమైనా.. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ల ను దెబ్బ తీసేలా వ్యవహరించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Similar News