చదువు, కెరీర్ మీద దృష్టి పెట్టడంతో పాటు పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొందరు మహిళలు గర్భం దాల్చడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. 25 ఏళ్లలోపు స్త్రీలు పెళ్లి చేసుకొని 30 ఏళ్ల లోపు పిల్లల్ని కనడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. అయితే 30 దాటినా కొంతమందిలో రోగనిరోధక శక్తితో ఆరోగ్య సమస్యలు రాకపోవచ్చు. 30 ఏళ్లు దాటిన తరువాత గర్భం దాల్చిన చాలా మందిలో అనారోగ్య సమస్యలు ఎదరవుతున్నాయి. ఇందుకు లేటు వయసులో గర్భం దాల్చడమేనంటున్నారు వైద్య నిపుణులు. ఈ పరిస్థితి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంది. మారుతున్న కాలంలో తల్లి కాబోయే వయసు రోజురోజుకు పెరుగుతోంది.
పాతికేళ్లలోపు తల్లి కావడం వల్ల యువతుల్లో ఎలాంటి సమస్యలు రాలేదు. ప్రతీ 1250 మంది పాతికేళ్ల వయసున్న వారిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే సమస్యలు ఉండగా.. 40 ఏళ్లు దాటిన ప్రతీ 100 మందిలో ఒకరికి అనారోగ్య సమస్యలు ఎదరవుతున్నాయి. 25 ఏళ్లలోపు యువతుల్లో ఎలాంటి గర్భం.. అంటే నార్మల్, సీజేరియల్ గర్భం దాల్చినా సమస్యలు తక్కువగానే ఉంటాయి. అదే 40 ఏళ్ల వయసున్న వారిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
40 ఏళ్లు దాటిన వారిలో గర్భం దాల్చాలంటే వారిలో అండాన్ని ఉత్తేజపరచాలి. అందుకు కొన్ని మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓవర్ సీస్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోం అనే ఒక సిస్టం విడుదలవుతుంది. ఇది శక్తివంతమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల అండాశయాల్లో సమస్యలు వస్తాయి. ఈ వయసున్న దాదాపు 70 శాతం మంది స్త్రీలలో ఈ సమస్యలు వచ్చినట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
గర్భం దాల్చాలనుకున్న మహిళల వయసు పెరిగే కొద్దీ క్రోమోజోమ్ ల సమస్య ఏర్పడుతుంది. వీరు డౌన్ సిండ్రోమ్ ఉన్న బిడ్డను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అండం గర్భాశయంలో ఏర్పడకుండా ఫెలోపియన్ ట్యూబులో ఏర్పడతుతుంది. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది అక్కడ ఇమడలేక పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగడం వల్ల స్త్రీల ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది.
ఇవే కాకుండా వయసు పెరిగిన మహిళల్లో సాధారణ వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వయసులో ఉన్నవారికి బీపీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గర్భం దాల్చే సమస్యంలో హైబీపీకి లోనయి బ్రెయిన్లో రక్తనాళాలు చిట్ల రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇక వీరికి షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. షుగర్ వ్యాధి వల్ల బిడ్డ బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలా బరువు పెరిగే కడుపులోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు మహిళలకు థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్లు దాటిన తరువాత థైరాయిడ్ సమస్యతో బరువు పెరుగుతారు. ప్రెగ్నీన్సీతో మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు తీవ్రమవడం వల్ల హైబీపీకి లోనయ్యే అవకాశం ఉంది.
మితిమీరి వయసు స్త్రీలలో ప్లాసెంటా సమస్యలు కూడా వస్తాయి. ప్లాసెంటా గర్భాశయం లోపల గోడలకు అతుక్కుని ఉంటుంది. ఇది తల్లి, బిడ్డకు ఆహారాన్ని అందించే ముఖ్యమైన భాగం. ఇక్కడ సమస్య ఏర్పడడంతో కాన్పు జరగక బయటపడుతుంది. గర్భాశయ ముఖద్వారానికి, కాన్పు జరిగే మార్గానికి ప్లాసెంటా దూరంగా ఉండాలి. కానీ వయసు పెరిగే కొద్దీ ఇది ద్వారాన్ని మూసివేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో గర్భంతో ఉన్నప్పుడే రక్తస్రావం జరిగి ప్రాణాపాయం జరగవచ్చు. వివిధ కారణాల వల్ల 35-40 ఏళ్లలో గర్భం దాల్చినప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.