రూ. 40 కోట్లతో ఎమ్మెల్యేలకు ఆఫర్‌..!

Update: 2019-02-04 07:45 GMT
కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ తో తమ ఎమ్మెల్యేలు కలిసి వస్తారని జేడీఎస్‌ చెబుతున్నా.. బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రభుత్వం కూలడం ఖాయమని బిజేపీ నాయకులు ఘంఠా బజాయించి చెబుతున్నారు. కాగా బీజేపీ ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లను పార్టీలోకి చేర్చుకుంది. మరో 12 మంది కాంగ్రెస్‌ నాయకులు తమతో టచ్‌ లో ఉన్నారని ఆ పార్టీ నాయకుడు అశోక్‌ తాజాగా బాంబు పేల్చారు.  బీజేపీ అనుకున్నట్లు 12 మంది బీజేపీలోకి చేరికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాగా బడ్జెట్‌ సమావేశాల్లో ఈ విషయం నిర్దారణ కానుంది.

అయితే బీజేపీ డబ్బులతో తమ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావ్‌ ఆరోపిస్తున్నారు. ఆపరేషన్‌ కమల పేరుతో రూ.40 కోట్లతో బీజేపీ నాయకులు తమ పార్టీ ఎమ్మెల్యేలపై వల పన్నుతున్నారని, ఆ డబ్బు వారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుపాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నళిన్‌ కుమార్‌ కటిల్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యేలకు మీకు ఎంతకావాలో తీసుకోండి.. అంత ఇస్తాం.. ఎక్కడికి పంపించాలో చెబితే అక్కడికి పంపిస్తామంటున్నారన్నారని ఆయన వాపోయారు. లేకపోతే  మీము చెప్పిన దగ్గరికి రండి.. అక్కడ అగ్రిమెంట్‌ మీద సంతకం చేసి డబ్బును తీసుకెళ్లండి అంటూ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని దినేశ్‌ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారని ఆయన తెలిపారు.
Tags:    

Similar News