క్రిప్టో కరెన్సీ గురించి తెలిసిందే. కంటికి కనిపించని ఈ కరెన్సీ మొత్తం డిజిటల్ రూపంలో ఉంటుంది. దీని విలువ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోవటం తెలిసిందే. క్రిప్టో కరెన్సీ అన్నంతనే బిట్ కాయిన్ గుర్తుకు వస్తుంది. ఇందులోని చాలానే ఉన్నాయి. వాటిల్లో మరొకటి డోజ్ కాయిన్. రెండు వారాల క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన ఈ కరెన్సీ ఇప్పుడు మరోలా ఉంది. దీని విలువ అమాంతం పడిపోయింది. దీనికి కారణం చైనా క్రిప్టోకరెన్సీని బ్యాన్ చేయటమే.
చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది కోట్ల రూపాయిలు గాల్లో కలిసిపోయాయి. డోజ్ కాయిన్ ను సపోర్టు చేసే వారిలో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కనిపిస్తారు.. ఆయన దీన్ని సపోర్టు చేస్తూ తరచూ ట్వీట్లు చేస్తుంటారు. అయితే.. డోజో కాయిన్ కు సంబంధించి ఒక మిస్టరీ అకౌంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో వేలాది కోట్లు విలువ చేసే డోజ్ కాయిన్లు ఉండటమే దీనికి కారణం. ఈ అకౌంట్ ఎవరిదన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా చెప్పాలి.
డోజ్ కాయిన్ అకౌంట్లకు సంబంధించి ఒక మిస్టరీ అకౌంట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరి కన్ను పడటమే కాదు.. దీని గురించి చర్చ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి కారణం.. ఆ అకౌంట్లో ఉన్న భారీ మొత్తమే. ది డోజ్ కాయిన్ వేల్ అకౌంట్(DH5yaieqoZN36fDVciNyRueRGvGLR3mr7L) చిరునామా మీద 2019 ఫిబ్రవరి 6న మొదటగా ఈ క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేశారు. అప్పట్లో డోజో కాయిన్ విలువ కేవలం 13 పైసలు (మన కరెన్సీ లెక్క ప్రకారం చూస్తే) ఉండేది. ఇప్పుడు ఆ అకౌంట్లో ఉన్న డోజ్ కాయిన్లు ఎన్నో తెలుసా? అక్షరాల 3,671 కోట్ల కాయిన్లు.
ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం చూస్తే.. ఈ కాయిన్ల విలువ ఎంతో తెలుసా? 12 బిలియన్ డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే ఏకంగా రూ.8,752 కోట్లు. ఇంత భారీ మొత్తం ఉన్న అకౌంట్ ఎవరిదన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీ. వాస్తవానికి చైనా క్రిప్టోకరెన్సీని బ్యాన్ చేయకముందు.. ఈ అకౌంట్ లో ఉన్న కాయిన్ల విలువ 22 బిలియన్ డాలర్లు. అంటే.. మన రూపాయిల్లో 16వేల కోట్లకుపైనే. రెండు వారాల క్రితం క్రాష్ కావటంతో దాని విలువ భారీగా పడిపోయింది.
మరింత భారీ మొత్తం ఉన్న అకౌంట్ ఎవరిదన్న దానిపై ప్రాశ్చాత్య మీడియా అంచనా ప్రకారం టెస్లా అధినేత ఎలన్ మస్క్ దే అయి ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. డోజ్ కాయిన్ గురించి ఎలన్ తరచూ ట్వీట్లు చేయటం లాంటివి చూసినప్పుడు ఈ మిస్టరీ ఓనర్ ఆయనే అయి ఉంటారని చెబుతారు. ఏమైనా.. ఒక మిస్టరీ అకౌంట్లో అన్ని వేల కోట్లు ఉండటం మాటలు కాదనే చెప్పాలి.