దాదాపు రెండున్నర నెలలుగా సాగుతున్న అమ్మ అనారోగ్యం ఎపిసోడ్ ఒక్కసారిగా భారీ ట్విస్ట్ కి గురైందని చెప్పాలి. నిన్నమొన్నటి వరకూ ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారని.. ఆమె ఆహారం స్వయంగా తీసుకుంటున్నారని.. లేచి నడుస్తున్నారని.. ఇంటికి పంపే రోజు దగ్గరకు వచ్చేసినట్లేనని.. ఇంటికి వెళ్లే విషయంలో అమ్మదే తుది నిర్ణయం లాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. ఇవన్నీ వార్తలుగా రావటమే కానీ.. ఆసుపత్రిలో చేరింది మొదలు ఇప్పటివరకూ ఆమెకు సంబంధించిన ఫోటో (చికిత్స జరుగుతున్నప్పుడు కానీ.. చికిత్స తర్వాత కానీ) ఒక్కటంటే ఒక్కటి బయటకు రాలేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమ్మ సేఫ్ అన్న భరోసాతో ఉన్న ఆమె అభిమానులు.. తాజా వార్తతో కదిలిపోతున్నారు. అంతులేని శోకంతో రోదిస్తున్నారు. తమ అమ్మకు ఏమైందంటూ వారు పెట్టుకుంటున్న కన్నీళ్లు అందరిని కదిలించి వేస్తున్నాయి. అనారోగ్యం నుంచి ఆరోగ్యం దిశగా అడుగులు వేస్తున్న ఆమెకు గుండెపోటు వచ్చిందన్న మాటతో పాటు.. ఆమెకు ఎక్మో చికిత్స చేస్తున్నట్లుగా వైద్యులు ప్రకటించారు.
అమ్మ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ అని చెబుతున్న వేళ.. ఆమెకు చేస్తున్న ఎక్మో చికిత్స ఏమిటి? దాని వల్ల ఏం జరుగుతుంది? అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఎక్మోను సింఫుల్ గా చెప్పాలంటే.. రక్తంలోఆక్సిజన్ స్థాయి తగ్గకుండా చూసే యంత్రంగా చెప్పాలి. గుండె.. ఊపిరితిత్తుల్లో సంక్షోభం ఏర్పడినప్పుడు.. ఈ యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరానికి పంప్ చేస్తుంటారు. ఈ విధానంలో రెండు విధానాల్ని అమలు చేస్తుంటారు.
మొదటి విధానంలో గుండె.. ఊపిరితిత్తులు పని చేస్తూనే వాటికి ఎక్మో సాయంగా ఉండటం.. రెండో దాన్లో మాత్రం గుండె.. ఊపిరితిత్తులకు తాత్కాలికంగా విశ్రాంతిని ఇచ్చేసి.. యంత్రం సాయంతో పని చేయించటం. ఇలా చేయించటం ద్వారా రక్తాన్ని శుద్ధి చేయటం ద్వారా..గుండె.. ఊపిరితిత్తుల మీద పడే భారాన్నితగ్గించటం.. వాటికి విశ్రాంతినివ్వటం కోసం ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటారు. సమస్యల్లా ఏమిటంటే.. ఇలాంటివి ఆఖరి ఛాయిస్ గానే చేస్తుంటారు. అలా అని సక్సెస్ అయ్యే ఛాన్సులు లేవని చెప్పలేం కానీ.. క్రిటికల్ అని మాత్రం చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/