ఏముంది.. అనుకున్న ద‌గ్గ‌ర నుంచి ఎన్నో ఉన్నాయ‌నే వ‌ర‌కు.. జ‌గ‌న్ విజ‌న్ ఇదీ..!

Update: 2023-03-12 14:54 GMT
అది 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. మూడు మాసాల స‌మ‌యం. అప్ప‌టికి అధికారంలో ఉన్న టీడీపీ నేత‌లు.. మేధో మ‌థ‌నం చేస్తున్నారు. రెండు రోజుల పాటు విజ‌య‌వాడ వేదిక‌గా.. టీడీపీ మేధావులు య‌న‌మ‌ల రా మకృష్ణుడు , సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. అప్ప‌టి స‌ల‌హాదారు కుటుంబరావు, మాజీ మంత్రి దేవినేఏని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. ఇలా సో కాల్డ్ నాయ‌కులు.. భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు బుర్ర‌ల‌కు ప‌దును పెట్టారు. కాఫీ క‌ప్పులు ఖాళీ అయ్యాయి.. భోజ‌నాల ప్లేట్లు ఖాళీ అయ్యాయి.

ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయి.. కొత్త‌గా ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ఏం చేయాల‌ని ఆలోచించారు. చివ‌ర‌కు తేల్చింది.. ఏంటంటే.."ఇప్ప‌టికే దేశంలో ఎక్క‌డా లేని అనేక వ్య‌వ‌స్థ‌లు తీసుకువ‌చ్చాం. ప్ర‌జ‌ల‌కు అనేకం చేస్తున్నాం. ఇక‌, చేయాల్సింది.. ఏమీ క‌నిపించ‌డం లేదు. అన్ని ప‌థ‌కాలు ఇచ్చాం. కొత్తగా కూడా ప‌థ‌కాలు లేవు" అని ఓ 32 పేజీల నివేదిక‌ను పార్టీ అధినేత చంద్ర‌బాబుకు అందించారు. దీనిని చంద్ర‌బాబు కూడా న‌మ్మేశారు.

నిజ‌మే! మ‌నం చాలానే అమ‌లు చేస్తున్నాం.. ఇక చేయ‌డానికి ఏముంది? అని చంద్ర‌బాబు ఆ త‌ర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ.. చెప్పేశారు. క‌ట్ చేస్తే.. విప‌క్షం వైసీపీ అప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉంది. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌తో వాడి వేడి పెంచింది. విస్తృత‌మైన ప‌థ‌కాలతో దూసుకువ‌చ్చింది. న‌వ‌ర‌త్నాల కాన్సెప్టును తీసుకువ‌చ్చింది. ముఖ్యంగా ఆర్బీకేల ద్వారా.. రైతుల‌కు.. ప్ర‌భుత్వానికి మ‌ధ్య  దూరం త‌గ్గించే ఏర్పాట్లు చేసింది. అదేస‌మ‌యంలో అమ్మ ఒడి.. ఆరోగ్య శ్రీ బ‌లోపేతం.. ఇంటికే రేషన్ వంటి అనేక కీల‌క ప‌థ‌కాల‌ను చేర్చారు.

దీంతో టీడీపీ నేత‌ల‌కు మాట‌లు లేకుండా పోయాయి. హుటాహుటిన‌.. మేల్కొని ప‌సుపు-కుంకుమ ప‌థ‌కాన్ని తెర‌మీదికి తెచ్చారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రూ.10 వేల చొప్పున విడ‌త‌ల వారీ విందు చేశారు. ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇక‌, వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. మేనిఫెస్టోలో పేర్కొన్న‌వి మాత్ర‌మే కాకుండా.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చింది. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను రంగంలోకి దింపింది.

ఇంటి డాక్ట‌ర్ కాన్సెప్టును తీసుకువ‌చ్చింది. 1వ తేదీనే ఇంటింటికీ.. ల‌బ్ధిదారుల‌కు పింఛ‌న్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఇలా.. అనేకానేక ప‌థ‌కాల‌తో జ‌గ‌న్ దూసుకుపోతున్నారు. ఇంకేమీ లేదు.. అనుకున్న చోటే.. ఎన్నో ఉన్నాయ‌ని ఆయ‌న ఆచ‌రణాత్మ‌కంగా చేసి చూపిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం జ‌రిగి 12 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన నేప‌థ్యంలో జ‌గ‌న్ గురించి ఆ పార్టీ నేత‌లు చెబుతున్న మాట ఇది!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News