ఇంద్రకీలాద్రిలో ఏం జరుగుతోంది?

Update: 2021-02-21 14:30 GMT
బెజవాడ కనకదర్గమ్మ సన్నిధిలో అసలేం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏసీబీ సోదాలు సుధీర్ఘంగా సాగుతుండడం అందరిలోనూ ఇదే ప్రశ్నకు తావిస్తోంది. గత మూడు రోజులుగా ఇంద్రకీలాద్రిపై ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.

మూడో రోజు ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు తనిఖీలు చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన టెండర్లపై ఆరాతీయగా.. పెండింగ్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? ఎన్ని పనులు జరిగాయనే విషయంపై రికార్డులను పరిశీలించారు. ఆ పనులకు జరిపిన చెల్లింపులు, పెండింగ్ బిల్లులపై ఆరాతీశారు.

ఇప్పటివరకు విజిలెన్స్, ఏసీబీ సోదాలు నిర్వహించినా ఇంత సుధీర్ఘంగా ఎన్నడూ జరగలేదని దుర్గగుడి వర్గాలు చెబుతున్నాయి. పక్కా సమాచారంతోనే రంగంలోకి ఏబీసీ అధికారులు దిగారని తెలుస్తోంది.

గురువారం ప్రారంభమైన సోదాలు మూడు రోజుల పాటు కొనసాగాయి. స్క్రాప్ అమ్మకాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్ ను కేవలం 40 లక్షలకే అమ్మినట్లుగా అధికారులు గుర్తించారు.

శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది టెండర్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చాయి ఏసీబీ పోలీసులు. ప్రొవిజన్స్ స్టోర్.. కేశఖండన, ప్రసాదం, సాధారణ పరిపాలన, చీరల విభాగంలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్, చీరల కౌంటర్, నిత్య అన్నదానం విభాగాల్లో కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. ఈవోగా కోటేశ్వరమ్మ బాధ్యతలు స్వీకరించాక.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించారు.అంతర్గత బదిలీల విషయంలో కూడా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
Tags:    

Similar News