సాగ‌ర్ స‌మ‌రంలో తాజా రిజ‌ల్ట్ ఎఫెక్ట్ ఎంత‌?

Update: 2021-03-22 15:30 GMT
తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా విడుద‌లైంది. అయితే.. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఎఫెక్ట్ సాగ‌ర్ ఎన్నిక‌ల‌పై ఉంటుందా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల విశ్లేష‌ణ‌. అధికార టీఆర్ ఎస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక‌, బీజేపీ అయితే.. దుబ్బాక సీన్‌నుఇక్క‌డ రిపీట్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. అధికార టీఆర్ ఎస్ మాత్రం.. బీజేపీకి ఎక్క‌డా తావివ్వ‌కుండా దూకుడు చూపించాల‌ని భావిస్తోంది.

ఇక‌, కాంగ్రెస్ నాయ‌కులు.. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునిముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదిలావుంటే, తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రెండు చోట్లా బీజేపీ ఘోర పరాభవం పాలైంది.  ఓ చోట సిట్టింగ్ స్థానం పోగొట్టుకోవడం, మరోచోట నాలుగో స్థానానికి పడిపోవడంతో బీజేపీ నాయ‌కులు తీవ్ర అస‌హ ‌నానికి గుర‌వుతున్నారు.. మ‌రోవైపు.. ఈ రెండు స్థానాల‌ను ఉత్కంఠ పోరులోనూ ద‌క్కించుకోవ‌డంతో టీఆర్ ఎస్‌లో ఉత్సాహం క‌నిపిస్తోంది. అయితే... ఇప్పుడు ఇదేఊపులో సాగ‌ర్ ఎన్నిక‌లు వ‌స్తున్నందున గెలుపు త‌మ ప‌క్షమేన‌ని టీఆర్ ఎస్ అంచ‌నాలు వేసుకుంటోంది.

అంతేకాదు.. దుబ్బాక బీజేపీ విజ‌యాన్ని గాలివా టు విజయం అని నిరూపించడానికి ఇదే చక్కని అవకాశంగా గులాబీ ద‌ళం భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే సాగర్ లో బలంగా ఉన్న కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థి జానారెడ్డిపై ఆశలు పెట్టుకుంది. సార్వ త్రిక ఎన్నికల తర్వాత ఏ దశలోనూ అధికార పార్టీతో కాదు కదా, కనీసం బీజేపీకి కూడా పోటీ ఇవ్వలేకపోవ డం కాంగ్రెస్‌కి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ సాగ‌ర్‌లో గెలిచి తీరాల‌ని న‌నాయ‌కులు నిర్ణ‌యించుకున్నారు. దీంతో సాగ‌ర్‌లో త్రిముఖ పోరు టీఆర్ ఎస్‌,బీజేపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య తీవ్రంగా సాగ నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. ఇక్క‌డ టీఆర్ ఎస్ విజ‌యం సాధించింది.  కాంగ్రెస్ రెండో స్థానంంలో నిలిచింది. బీజేపీ మూడో స్థానానికే ప‌రిమిత‌మైంది. టీఆర్ ఎస్ అభ్య‌ర్థి నోముల నర్సింహయ్యకు 46.34శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి జానా రెడ్డి కేవలం 4 శాతం ఓట్ల తేడా(42.04)తో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక బీజేపీకి 1.48 శాతం మాత్రమే ఓట్లు ల‌భించాయి. సో.. దీనిని బ‌ట్టి టీఆర్ ఎస్ దే విజ‌యం అని భావించొచ్చు. కానీ, ఈ రెండేళ్లలో బీజేపీ రాజ‌కీయాలు మారిపోయాయి. సో.. ఈ నేప‌థ్యంలో సాగ‌ర్‌లో త్రిముఖ పోటీ ఉంటుంద‌న‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News