హరీశ్ క్రికెట్ లో ‘సీక్రెట్ గేమ్ ప్లాన్’ ఏమిటంటే.. ఎలా రియాక్టు అయ్యారంటే?
తెలుగు రాజకీయాల్లో సుపరిచితుడైన హరీశ్ రావును ఈ మధ్యన గమనించారా? ఆయన పాల్గొనే రాజకీయ సభల కంటే కూడా.. ఆడే క్రికెట్ మ్యాచులు ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారింది. సిద్దిపేటలో తరచూజరుగుతున్న క్రికెట్ టోర్నీలో ఆయన తెగ ఆడేస్తున్నారు. దశాబ్ద రాజకీయంలో ఎప్పుడూ క్రికెట్ క్రీడాకారుడిగా కనిపించని ఆయన.. తాజాగా తన ఇమేజ్ ను మరోలా ప్రజెంట్ చేయటం వెనుక రహస్యమేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో జోరుగా రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళలో.. దానికి విరుద్ధమైన క్రికెట్ గేమ్ మీద ఆయన మరింత సీరియస్ గా ఆడటం చర్చనీయాంశంగా మారింది. అదెంత వరకు వెళ్లిందంటే.. హరీశ్ క్రికెట్ఆడటం వెనుక ఏమైనా ప్లాన్ ఉందా? అనే ప్రశ్న తరచూ వ్యక్తమవుతోంది. యూత్ ను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు వీలుగా.. వారిని ఇట్టే కనెక్టు చేసే క్రికెట్ ను ఎంచుకున్నట్లుగా చర్చ జరుగుతోంది.
ఇలాంటివేళ.. హరీశ్ క్రికెట్ ఆడటం వెనుకున్న రహస్యమేమిటన్న ప్రశ్నకు తాజాగా ఒక చానల్ సంధించింది. దీనికి నవ్వేసిన హరీశ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలోనూ క్రికెట్ ఆడేవాడినని.. టైం దొరికితే క్రికెట్ ఆడుతూ ఉండేవాడినని.. ఆ క్రీడ మీద ఉన్న ఆసక్తితోనే సిద్ధిపేటలో డే అండ్ నైట్ మ్యాచ్ లు ఆడుకునేలా స్టేడియంను సిద్ధం చేసినట్లు చెప్పారు.
డే అండ్ నైట్ ఆడుకునేందుకు వీలుగా సిద్దిపేట లో క్రికెట్ స్టేడియంను సిద్ధం చేసి.. దాని ప్రారంభం సందర్భంగా క్రికెట్ ఆడానని.. అందులో సరదాగా ఆడటమే తప్పించి.. మరింకేమీ ప్లాన్ లేదన్నారు. రిలాక్సేషన్ కోసం క్రికెట్ ఆడుతానని.. అందులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. సెంటిమెంట్.. తాత్కాలిక తాయిలతో ఎవరూ రారని.. యూత్ మన కంటే తెలివైనోళ్లన్నారు.
నీతి.. నిజాయితీని చూస్తారే తప్పించి.. తాత్కాలిక సెంటిమెంట్లు రాజకీయాల్లో వర్కుట్ కావన్నారు. అందరికి ఉద్యోగాలు ఏ దేశం.. రాష్ట్రం ఇవ్వలేదన్న ఆయన.. యూత్ వ్యాపారాలు చేయాలని.. ఆర్థికంగా బలంగా ఉండాలన్నారు. మొత్తానికి తాను ఆడే క్రికెట్ లో ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదన్న హరీశ్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.