నవరత్న కంపెనీల్లో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు పావులు కదుపుతోంది. దీనికి సంబంధించి చేపట్టే కార్యాచరణ పక్కాగా ఉండాలే తప్పించి.. అనవసర భావోద్వేగాల్ని జొప్పించి.. కంగాళీ చేసే ప్రయత్నం చేయకూడదు. మోడీ ఎంత మొండి వ్యక్తో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నంతనే.. తదనంతరం వచ్చే పరిణామాల్నిమోడీ ఆలోచించకుండానే ఈ నిర్ణయాన్ని తీసుకుంటారా? ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను ఎలా అణిచివేయాలన్న అంశంపై మోడీ టీం బాగానే వర్కువట్ చేసి ఉంటుంది.
మరి.. అలాంటప్పుడు ప్రజల మనోభావాల్ని కేంద్రం గౌరవించేలా చేయటం కోసం.. ఆచితూచి వ్యవహరించాలి. ఈ అంశంపై పోరు దీర్ఘకాలికమన్నది మర్చిపోకూడదు. తొందరపడి ప్రకటనలు చేసేసి.. చేతులు దులుపుకుంటే సరిపోదు. ఈ విషయాన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలీదా? అన్నది ప్రశ్న. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర సర్కారు నిర్ణయాన్ని తప్పుపడుతున్న ఆయన.. ఆలోచనతో కంటే ఆవేశంతో రియాక్టు అవుతున్న తీరు ఏపీకి నష్టం వాటిల్లేలా చేస్తుందన్నది మర్చిపోకూడదు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మటానికి బదులుగా ఏమేం చేయొచ్చన్న అంశాల్ని నిర్మాణాత్మకంగా వివరిస్తూ.. సుదీర్ఘ రాసిన సీఎం జగన్ విజన్ కు.. ఆవేశంతో రాజకీయ ప్రయోజనం పొందాలన్న అత్యాశతో వ్యవహరిస్తున్న విపక్ష నేత చంద్రబాబు తీరు చూస్తే.. ఇదేం పద్దతన్న ఆశ్చర్యం వ్యక్తం కాక మానదు. తాజాగా ఆయనీ అంశంపై చేసిన వ్యాఖ్యలు చూస్తే.. విశాఖ ఉక్కుపై ఆవేశపు ప్రకటనల కంటే కూడా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.
ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే మరో ఉక్కు ఉద్యమం తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించటం చూస్తే.. ఆయన తన రొడ్డుకొట్టుడు మాటల్ని ఆపరా? అన్న భావన కలుగక మానదు. ఉక్కు కర్మాగారాన్ని తుక్కుకింద కొనేసి లక్షల కోట్లు కొట్టేద్దామనుకుంటున్న జగన్ రెడ్డి గ్యాంగ్ కుతంత్రాల్ని ప్రజల మద్దతుతో అడ్డుకొని తీరుతామన్న అనవసర ప్రేలాపల్ని ట్విటర్ లో పేలిన వైనం విస్మయానికి గురి చేయకమానదు.
ప్రత్యేక హోదాను బాబాయ్ హత్య కేసుకు తాకట్టు పెట్టారు.. ఇప్పుడు విశాఖ ఉక్కుపై స్పందించొద్దంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ నోరు కుట్టేశారంటూ విరుచుకుపడ్డారు. విశాఖ పరిపాలనా రాజధాని అన్న జగన్ ఇప్పటికే కొండలు.. గుట్టలు కొట్టేసి భూములు ఆక్రమించి.. ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డారన్న రోటీన్ రాజకీయ నేతగా మాట్లాడిన మాటలు బాబుపై ఉన్న గౌరవాన్ని మరింత తగ్గిస్తాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలన్నదే కార్యాచరణ అయితే.. రాజకీయ ప్రయోజనం కోసం నోటికి ఎలా వస్తే అలా మాట్లాడరన్నది బాబు గుర్తు పెట్టుకోవాలి.
గతంలో వాజ్ పేయ్ ప్రభుత్వం ఇదే పరిస్థితిని తీసుకొస్తే.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ కాపాడిందన్న విషయాన్ని బాబు గుర్తు చేయటం బాగుంది. కానీ.. ఆ పేరుతో అధికార పార్టీపై నోరు పారేసుకోవటం సరికాదన్నది మర్చిపోకూడదు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటమే ఎజెండా అయినప్పుడు రాజకీయ విమర్శలకు వెళ్లకుండా.. ఆంధ్రోళ్లమంతా కలిసి పోరాడాదామని.. ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్న పెద్ద మనిషి మాటలు చంద్రబాబు నోటి వెంట ఎందుకు రావు? కేంద్రంతో పోరు అంశాన్ని మాట వరసకు అనేసి ఊరుకునే కన్నా.. పక్కా కార్యాచరణ అవసరమన్న విషయాన్ని బాబుకు గుర్తు చేయాల్సి రావటమా? విశాఖ ఉక్కుపై బాబు చేసే వ్యాఖ్యలు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం తప్పించి.. మరింకేమీ ఉండదన్న విషయాన్ని గుర్తించటం మంచిది.