రెండు తెలుగు రాష్ట్రాలు గొప్ప చిక్కు ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద.. రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. దీనిలో 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది. ఇది చట్టం ప్రకారం జరిగే ప్రక్రియ. అయితే.. ఇలా ఇచ్చిన నిధులను రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇతర పనులకు కేటాయించాయి. ఈ విషయంలో తెలంగాణపై కేంద్రం నిప్పులు చెరుగుతోంది.
ఏపీ కూడా ఇలానే ఈ సొమ్మును దారి మళ్లింది. అయినా.. ఏపీ విషయంలో మాత్రం మౌనంగా ఉన్న కేం ద్రం.. తెలంగాణను ఇరుకున పడేసింది. తెలంగాణకు ఉపాధి నిధుల కింద రూ.2000 కోట్లను ఇచ్చామని.. కానీ, ఈ సొమ్మును రైతుల కల్లాలు బాగుచేసుకునేందుకు వినియోగించారని.. సో. ఈ నిధులను తమకు తిరిగి ఇచ్చేయాలని కేంద్రం నుంచి నోటీసులు వచ్చాయి.
అయితే.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. శుక్రవారం అన్ని జిల్లాల్లోనూ రైతులతో కలిసి నిరసనకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సరే.. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.2500 కోట్లను కేంద్రం ఇచ్చింది. వీటిలో కొంత మొత్తాన్ని ఉపాధి పనులకు వెచ్చించిన జగన్ ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని దారి మళ్లింది.
పాఠశాలల్లో చేస్తున్న నాడు-నేడు పనులకు కేటాయించింది. పాఠశాల స్థలాల్లో 63 చోట్ల సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించారు. 57 చోట్ల వాటిని పాఠశాలలకే అప్పగించగా.. తరగతి గదులకు, ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఇంకా అసంపూర్ణంగా ఉన్న భవనాలు చాలానే ఉన్నాయి.
ఉపాధి నిధులు వాడేస్తున్నారంటూదాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారిస్తూ.. ఆ నిర్మాణాలపై స్టే ఇచ్చింది. అంటే.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా డబ్బుల కోసంఉపాధి నిధులు వాడేస్తున్నాయనేది వాస్తవమేనని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.