ఏపీ సీఎం జగన్ మరోసారి ఏపీ మూడు రాజధానులపై ఫుల్ ఫోకస్ పెట్టారు.అసెంబ్లీలో ప్రకటన చేసినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, హైకోర్టులో జగన్ కు ఎదురుదెబ్బలు తగిలాయి. న్యాయపరమైన ఇబ్బందుల నేపథ్యంలో దీనిపై జగన్ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఫలితంగా జాప్యం కొనసాగుతోంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులు ఏర్పడడంతో ఏడాదిగా ఈ వ్యవహారంపై జగన్ దృష్టి సారించలేదు. కేంద్రం దృష్టికి మాత్రం దీన్ని తీసుకెళ్లారు. తాజాగా మరో కీలక భేటికి జగన్ రెడీ అయ్యారు.అమరావతి మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ) మీద సమీక్ష నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష కాసేపట్లో ఆరంభం కాబోతోంది.మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేయడంపై పూర్తిస్థాయిలో ఓ సమగ్ర సమీక్షను నిర్వహించబోతుండడం.. ఈ మధ్యాకాలంలో ఇదే తొలిసారి కావడం.. ఫలితంగా అందరి దృష్టి దానిమీదే నిలిచింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఏఎంఆర్డీఏ పై వైఎస్ జగన్ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించడం.. ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. జగన్ ప్రకటనపై అందరిలో ఉత్కంఠ కలుగుతోంది.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం అమరావతి నిర్మాణ పనులను పున: ప్రారంభించేలా నిర్ణయాలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.ఇక కీలకమైన హైకోర్టు అభిప్రాయాన్ని కూడా తీసుకొని దాన్ని తరలించవచ్చంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన చేయడంతో హైకోర్టు దిశగా జగన్ చర్యలు ఉంటాయని చెబుతున్నారు.