చెవుల్లోకి నీళ్లు పోతే.. అలా మాత్రం చేయకూడదట

Update: 2019-11-25 05:46 GMT
చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంటుంది. చాలామంది నిత్యం చేసే తప్పుల్లో ఇప్పుడు చెప్పేదొకటి. చాలా క్యాజువల్ గా చేసే పని వెనుక పెద్ద డేంజరే ఉందన్న హెచ్చరికను చేస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణం గా స్నానం చేసే సమయంలో చెవుల్లోకి నీళ్లు పోవటం తెలిసిందే. ఇలా నీళ్లు పోయిన వెంటనే తలను విదల్చటం ఆటోమేటిక్ గా చేస్తుంటారు.

ఇలా చేయటం కారణంగా లోపలకు పోయిన నీళ్లు బయటకు వస్తాయని భావిస్తారు. కానీ.. ఈ అలవాటు పెను ప్రమాదానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెవుల్లోకి నీళ్లు పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలను అటూ ఇటూ విదిల్చే పని అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అలా చేయటం చాలా డేంజర్ అని చెబుతున్నారు.

అమెరికా కు చెందిన కార్నెల్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి చెబుతూ.. చిన్నపిల్లలు ఇలా చేయటం వల్ల వారి మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. చిన్నవారితో పోలిస్తే పెద్ దవారిలో ఈ అపాయం తక్కువేనని చెబుతున్నారు. పెద్ద వారితో పోలిస్తే చిన్న పిల్లల్లో చెవి నాళం వ్యాసం చిన్నదిగా ఉండటం వల్ల నీళ్లు మెదడు వ్యవస్థను దెబ్బ తీస్తుందని చెబుతున్నారు.

చెవుల్లో నీళ్లు పోయినప్పుడు.. వాలుగా వంచటం కానీ.. పొడిబట్ట.. లేదంటూ బడ్ తో నీళ్లను తీసే ప్రయత్నం చేయాల్సి. ఈ విషయాన్ని చిన్నపిల్లల కు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిదంటున్నారు.
Tags:    

Similar News