ప్రజా జీవితంలో ఉన్న వారికి బలం అంటూ ఏమైనా ఉన్నదంటే అది ప్రజాబలం మాత్రమే అన్నది మర్చిపోకూడదు. ఎంతటి తీవ్రమైన తప్పు చేసినా.. వాటిని పట్టించుకోకుండా ప్రజలు తమ మద్దతును సదరు నేతకు ఇచ్చినప్పుడు వారిని టచ్ చేసేందుకు వ్యవస్థలు సైతం ఇబ్బందులకు గురి అవుతుంటాయి. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఖాయమని చెప్పక తప్పదు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న వారు.. వరుస పెట్టి ఆమె చేస్తున్న తప్పులపై విస్మయం వ్యక్తమవుతోంది. తన గారాలపట్టి తన జీవితంలో అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ.. ఆ సమస్యల నుంచి బయట పడేసేందుకు వీలుగా తండ్రిగా కేసీఆర్ ఎంతలా తపిస్తారో తెలియంది కాదు. అలాంటి ఆయన కవితకు అండగా ఉన్నప్పుడు.. వరుస పెట్టి తప్పులు ఎందుకు చేస్తున్నట్లు? అన్న సందేహం కవిత ఎపిసోడ్ ను చూస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు.
ఏదైనా తీవ్ర ఆరోపణలు ఎదురైనప్పుడు.. రాజకీయాల్లో ఉన్న వారు తమ మీద వచ్చిన ఆరోపణలన్ని రాజకీయంగా తమను దెబ్బ తీసేందుకు వీలుగా చేస్తున్న ప్రయత్నాలుగా ప్రజలకు చెప్పుకోవటం తెలిసిందే. తమను ఇబ్బందికి గురి చేసేందుకు.. తమ ఇమేజ్ ను దెబ్బ తీసే కుట్రలో భాగంగానే తమను తప్పుడు కేసుల్లో ఇరికించారని పేర్కొంటూ తమకు తాము ఆణిముత్యాలుగా.. స్వాతి ముత్యాలుగా పేర్కొనటం మామూలే. ఇలాంటి వేళలో.. సామాన్యులకు వచ్చే సందేహం ఏమంటే.. కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బ తీయటానికి టార్గెట్ చేస్తే.. కేటీఆర్ నో.. హరీశ్ రావునో.. ఎంపీ సంతోష్ రావునో లక్ష్యంగా చేసుకోవాలే కానీ ఆడబిడ్డ కవితను ఎందుకు టార్గెట్ చేస్తారు?
తప్పుడు కేసులు లేదంటే.. తమను లొంగదీసుకోవటానికి వీలుగా దర్యాప్తు సంస్థల్ని సంధించారన్న వాదన వినేందుకు బాగానే ఉన్నా.. విచక్షణతో ఆలోచించినప్పుడు.. కవితనే ఎందుకు? అన్న ప్రశ్న దగ్గర ఆగే పరిస్థితి. ఎందుకంటే.. ఆడబిడ్డపై కేసులు పెడితే.. ప్రజల్లో సానుభూతి ఖాయం. ఎంత రాజకీయం అయితే మాత్రం ఆడపిల్లను ఏడిపిస్తారా? ఇబ్బందులకు గురి చేస్తారా? అన్న ఆగ్రహం వ్యక్తమవుతుంది. అందుకు భిన్నంగా ఎమ్మెల్సీ కవిత విషయంలో అలాంటి సానుభూతి పెద్దగా లేకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.
దీనికి ఆమె వ్యవహరించిన తీరు కూడా కారణమని చెబుతున్నారు. ఈడీ విచారణకు పిలిచినప్పుడు వెళ్లి ఉంటే మరోలా ఉండేదని.. అందుకుభిన్నంగాసుదీర్ఘమైన లేఖ రాయటం.. అందులో తనను ఈడీ అధికారులు ఎలా విచారించాలన్న దానిపై వివరంగా వివరాల్ని పేర్కొనటం.. దాన్ని సొంత మీడియాలో భారీగా పబ్లిష్ చేసుకోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో చట్టం ఇంత జాగరూకతో వ్యవహరించాలని కవిత చెప్పటం బాగానే ఉన్నా.. తన తండ్రి తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఈ తరహాలో చట్టాన్ని ఎంతమంది నేతల విషయంలో అనుసరించారు. హక్కులు అన్నవి కవితకు మాత్రమేనా? మిగిలిన వారికి ఉండవా? అన్న భావన కలిగేలా ఆమె లేఖ ఉందని అంటున్నారు.
సాధారణంగా దర్యాప్తు సంస్థల నుంచి విచారణను ఎదుర్కొంటున్న వేళలో.. ప్రజల్లో సానుభూతి వ్యక్తమయ్యేలా చేయటం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. కవిత ఎపిసోడ్ లో అలాంటివేమీ కనిపించని పరిస్థితి. ఆమె వేస్తున్న అడుగులు ఆమెపై జాలి పడే కన్నా.. అందుకు భిన్నమైన వాతావరణం చోటు చేసుకునేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ఆమె ప్రత్యేక విమానాన్ని వినియోగించటం లాంటి అంశాల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి చర్యలు పాజిటివ్ గా కంటే కూడా నెగిటివ్ గా ప్రచారం అవుతుంటాయన్నది మర్చిపోకూడదు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఆరోపణలు ఎదుర్కోవటం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా బయటకు వచ్చిన వివరాలపై ఆమె నుంచి వచ్చిన వాదనతో పాటు.. ఆమెకు అండగా నిలిచిన వారు చేసిన వ్యాఖ్యలు ఏవీ కూడా ఆమెను వేధింపులకు గురి చేస్తున్న భావన కలిగేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా జరగటం వల్ల సానుభూతి పెద్దగా ఉండదని.. దాని వల్ల నష్టం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
అంతేకాదు.. ఈ కేసు వేళ ఆమె వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ లాంటి మాస్టర్ మైండ్ డైరెక్టు చేసినప్పుడు ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి.. కవిత ఎపిసోడ్ లో ఎందుకు వరుస తప్పులు జరుగుతున్నాయి? అన్నది ప్రశ్నగా మారింది. తమ లాంటి అమాయకుల్ని అదే పనిగా వెంటాడుతూ.. వేధింపులకు గురి చేస్తున్న భావన ప్రజలకు కలగాలే తప్పించి.. అందుకు భిన్నంగా ఆర్భాటం.. చేతిలో ఉన్న అధికారాన్ని ప్రదర్శిస్తునన తీరు నెగిటివ్ గా మారుతున్న పరిస్థితి. మరి.. ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.