ఏ మాటకు ఆ మాట చెప్పాలి. సగటు జీవులకు చాలా భిన్నంగా వ్యవహరిస్తారు నెటిజన్లు. అప్పటివరకు ఆకాశానికి ఎత్తేసినా.. చిన్న తేడా వస్తే చాలు.. పాతాళానికి తొక్కేయటం ఎలా అన్నది వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. ఏ మాత్రం సందేహం కలిగినా.. నిర్దాక్షిణ్యంగా వాడటం ఆపేసే విషయంలో అస్సలు మొహమాటపడరు. ఈ విషయం మరోసారి బాగా అర్థమయ్యేలా చేశారు.
మేసేజింగ్ యాప్ లో తిరుగులేని స్థాయిలో ఉన్న వాట్సాప్.. ఎందుకొచ్చిందో కానీ సిత్రమైన ఐడియా.. కొత్త ప్రైవసీ పాలసీని తెర మీదకు తెచ్చింది. అంతవరకు బాగానే ఉన్నా.. చివర్లో పెట్టిన కండీషన్ కారణంగా నెటిజన్లకు ఎక్కడో కాలిపోయింది. మా ప్రైవసీ పాలసీని మారుస్తున్నాం.. ఇష్టమైతే ఓకే చెప్పండి అంటే బాగుండేది. ఎప్పుడైతే.. డేట్ ఇచ్చి మరీ.. ఫలానా టైం లోపు మీరు ఓకే అనకుంటే.. సేవల్ని ఆపేస్తామన్న వార్నింగ్ చాలామందికి అస్సలు నచ్చలేదు.
ఈ డిజిటల్ ప్రపంచంలో.. ఎవరు ఎవరిని బెదిరించటం.. హెచ్చరికలు చేయటాన్ని అస్సలు ఇష్టపడం. అలాంటిది ఎంత వాట్సాప్ అయితే మాత్రం.. వార్నింగ్ ఇచ్చేయటమేనా? అని తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. నువ్వు ఒక్కడివే అనుకోకు.. నీకు మించినోళ్లు ఉన్నారు మాకు అంటూ తాజాగా టెలిగ్రాం.. సిగ్నల్ యాప్ లను తెగ డౌన్ లోడ్ చేసేస్తున్న వైనం ఈ మధ్యన ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.
జనవరి 5 నుంచి 12 మధ్య.. అంటే కేవలం ఏడు రోజుల వ్యవధిలో గూగుల్.. యాపిల్ స్టోర్ల నుంచి సిగ్నల్ యాప్ ను 17.8 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నట్లుగా మొబైల్ యాప్ అనలిటిక్స్ సంస్థ సెన్సర్ టవర్ వెల్లడించింది. అంతకు ముందు వారం (2.85 లక్షలు)తో పోలిస్తే ఇది 61 శాతం ఎక్కువ కావటం గమనార్హం. వాట్సాప్ తీసుకున్న నిర్ణయంతో సిగ్నల్ యాప్ కు మాత్రమే కాదు.. టెలిగ్రాం యాప్ నకూ గిరాకీ పెరిగినట్లుగా చెబుతున్నారు. జనవరి 5 నుంచి 12 మధ్య 15.7 మిలియన్ల డౌన్ లోడ్లు పెరిగాయి. గత వారంలో నెలకొన్న 7.7 మిలియన్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం విశేషంగా చెప్పాలి.
ఇదిలా ఉంటే.. వాట్సాప్ తీసుకున్న తాజా నిర్ణయం.. అటు తిరిగి ఇటు తిరిగి వివాదం దాని మీదా పడటం గమనార్హం. అంతకు ముందు వారం 12.7 మిలియన్ల డౌన్ లోడ్లు తగ్గినట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. వాట్సాప్ బ్యాచ్ నెమ్మదిగా ఇతర మాథ్యమాలకు వెళుతున్నారన్న మాట వినిపిస్తోంది.
వాట్సాప్ తాజాగా తెర మీదకు తీసుకొచ్చిన నిర్ణయం.. దాని ప్రత్యర్థులకు చక్కటి అవకాశాన్ని ఇవ్వటమే కాదు.. వాట్సాప్ తీరు మార్చుకోకుండే రానున్న రోజుల్లో మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికల్ని తాజా డౌన్ లోడ్ లతో చెప్పకనే చెప్పేస్తున్నారని చెప్పాలి. వాట్సాప్ మరేం చేస్తుందో చూడాలి.