సోషల్‌మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో? ఎవరూ చెప్పలేరు..! చాలా తప్పుడు లింక్‌లు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ లింకులు ఓపెన్ చేయగానే.. మన ఫోన్లోకి మాల్వేర్ వచ్చి పడుతుంది. లేదంటే మొబైల్లో ఉన్న డాటా అంతా చోరీ అవుతూ ఉంటుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియక.. లింకులు షేర్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఓపెన్ చేసినప్పుడు ఏమీ రాకపోయానా.. మళ్లీ మళ్లీ ట్రై చేస్తూనే ఉంటారు. పోయేదేముంది డాటానే కదా..! అని వాళ్ల అభిప్రాయం.
కానీ మన వీక్నెస్ను ఆసరా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. తాజాగా వాట్సాప్ లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అదేమిటంటే..
ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా తాజ్ హోటల్ ఓ ఆఫర్ ప్రకటించిందని ఓ లింక్ ఓపెన్ వైరల్ అవుతుంది. లింక్ ఓపెన్ చేశాక.. మీకు ఓ గిఫ్ట్‌కార్డు వచ్చిందని.. దీనితో ఏడురోజులపాటు హోటల్లో ఉండే అవకాశం ఉంటుందని ఆ లింక్‌లో ఉంది. నిజానికి ఇప్పటివరకు ఎవరికీ అటువంటి అవకాశం రాలేదు.
అయినప్పటికీ చాలా మంది ఈ లింక్‌ను షేర్ చేస్తున్నారు. ఈ విషయం తాజ్ హోటల్ దృష్టికి చేరింది. దీనిపై తాజ్ హోటల్ స్పందించింది. ‘వాలంటైన్స్ డే సందర్భంగా తాజ్ హోటల్ ఎటువంటి ఆఫర్లు ప్రకటించలేదు. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్‌కు తాజ్ హోటల్‌కు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఆ ప్రకటనను చూసి మోసపోకండి’ అని తాజ్‌హోటల్ ఓ ప్రకటన విడుదల చేసింది.