జనసేనాని పవన్ కల్యాణ్ హత్యకు రెక్కీ నిర్వహించారని వస్తున్న కథనాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇక జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయంపై తీవ్ర స్థాయి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద ఉద్దేశపూర్వంగా కొందరు పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవపటడం, బూతులు తిట్టడం చేశారని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జెడ్‌ప్లస్ సెక్యూరిటీ ఫర్ పవన్ కల్యాణ్ హ్యాష్‌టాగ్ గురువారం ఉదయం నుంచి ట్రెండ్ అయింది. ఈ హాష్‌ట్యాగ్‌తో దాదాపు 93 వేల ట్వీట్లు రావడం గమనార్హం. పవన్ కల్యాణ్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను కోరుతూ జనసేన శ్రేణులు, అభిమానులు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం జనసేన – బీజేపీ పార్టీల మధ్య పొత్తు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ హత్యకు కుట్ర పన్నారని వార్తలు వస్తున్నప్పటికీ బీజేపీ నేతల నుంచి సరైన స్పందన లేకపోవడంపై జనసేన పార్టీ అసంతృప్తిగా ఉందని వార్తలు వస్తున్నాయి.
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్‌పై రెక్కీ నిర్వహించడం, పవన్ ఇంటి దగ్గర యువకులు గొడవపడటం వంటివాటిని ఖండించారు. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. అయితే ఇది సరిపోదని కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి తమ మిత్ర పక్షం నాయకుడైన పవన్ కల్యాణ్‌కు కేంద్ర భద్రత కల్పించేలా ఏపీ బీజేపీ నేతలు చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది.
అలా కాకుండా కేవలం కంటి తుడుపు చర్యలా పవన్ కల్యాణ్‌పై రెక్కీ నిర్వహించడాన్ని ఖండిస్తే సరిపోదని అంటున్నారు. కేంద్రంలో ఉంది తమ ప్రభుత్వమే కాబట్టి.. ఈ అంశంపై కేంద్ర పెద్దలతో మాట్లాడి పవన్ కల్యాణ్‌కు భద్రత కల్పించడంపై భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ ఆశిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.