ఈ మధ్య రాష్ట్ర రాజకీయాలను ఒక్క లెక్కన వేడెక్కించిన నేత నెల్లూరు పెద్దారెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. రూరల్ జిల్లా ఎమ్మెల్యే అయిన ఈయన ఫైర్ బ్రాండ్. ఆయన మాట్లాడితే అది ఒక ప్రవాహంగా ఉంటుంది. ఆయన బలమైన వాయిస్ తో మాట్లాడుతూంటే ఆ ధాటికి ఆయన చెప్పేది నిజం అని ఎవరైనా నమ్మాల్సిందే. జగన్ కి భక్తుడు, వైఎస్సార్ ఫ్యామిలీకి వీర విధేయుడు అని ముద్ర వేసుకున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇపుడు ఏ పార్టీలో చేరుతారు అన్నది చర్చనీయాశం అయింది.
ఆయన జగన్ ప్రభుత్వం మీద విరుచుకుని పడిపోయారు. తాను అవమానం జరిగిన చోట ఉండలేను అనేశారు. తాను వైసీపీ తరఫున పోటీ చేసేది లేదు అని చెబుతూనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఉంది అని తన కోరికను కూడా అలా బయటపెట్టుకున్నారు. అలాంటి కోటం రెడ్డి ఇంత రాజకీయ సునామీ సృష్టించినా వైసీపీ సర్దుకుంది. కానీ టీడీపీ సైలెంట్ గానే ఉండిపోతోంది.
వైసీపీ అయితే కోటం రెడ్డి ప్లేస్ లో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని తెచ్చి పెట్టేసింది. వచ్చే ఎన్నికల్లో మా క్యాండిడేట్ ఈయనే అని చాటి చెప్పింది. కానీ ఆదికి ముందు గొంతు చించుకున్న కోటం రెడ్డి మాత్రం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
ఆయన అయితే చంద్రబాబు మీదనే ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు. తన కోరిక చెప్పారు. జగన్ని విమర్శించారు. ఇక తన రాజకీయాన్ని పసుపు పార్టీ నీడనే అని ఒట్టేసుకున్నారు. ఇంతలా శీల పరీక్షను ఎదుర్కొన్నా కూడా కోటం రెడ్డిని టీడీపీలో నాయకులు అనుమానంగా చూస్తున్నారుట. అందుకే ఆయన రాకకు బ్రేకులేస్తున్నారు అని అంటున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరుకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే కోటం రెడ్డిని అసలు రానీయకూడదనే భావిస్తున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆయన ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంత్రి పదవిని కోరుకుంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో మంత్రి పదవిని చేసిన సోమిరెడ్డి మరోసారి మినిస్టర్ కావాలని ఆశిస్తున్నారు. కోటం రెడ్డి వస్తే కనుక ఆయనకు పోటీ అవుతుంది అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఒక్కరే కాదు చాలా మంది నేతలు కోటం రెడ్డి మీద అధినాయకత్వానికి ఫిర్యాదులు చేశారని, ఆయనను తీసుకోవద్దని కోరారని అంటున్నారు.
దాని వల్లనే కోటం రెడ్డికి టీడీపీ పిలుపు అలా ఆగిందని అంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు అంతా కలసి కోటం రెడ్డికి వ్యతిరేకంగా నివేదికను తయారు చేసి ఇచ్చారని అంటున్నారు. ఇక కోటం రెడ్డి విషయంలో టీడీపీ అధినాయకత్వం మనసులో ఏముందో తెలీయదు కానీ మౌనమే సమాధానం అవుతోంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే కోటం రెడ్డికి చంద్రబాబుకు మధ్య ఒక అవగాహన లేకపోయినా ఆయనకు కచ్చితమైన రాజకీయ హామీ లేకపోయినా వైసీపీ మీద ఈ రేంజిలో ద్వజమెత్తి తన రాజకీయాన్ని రిస్క్ లో ఎందుకు పెట్టుకుంటారు అని అన్న వారూ లేకపోలేదు. కోటం రెడ్డిని తీసుకునే ముందు జస్ట్ అభిప్రాయ సేకరణ కిందనే జిల్లా నాయకుల నుంచి నివేదిక కోరారు తప్ప అది ప్రమాణంగా తీసుకోరు అని అంటున్నారు. బాబు హామీ ఏనాడో ఇచ్చి ఉంటారని, తగిన సమయంలో కోటం రెడ్డికి పిలుపు తప్పకుండా వస్తుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే కోటం రెడ్డి విషయం మాత్రం ఇపుడు భగ్గున మండి చప్పున చల్లారిన వైనంగానే ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.