ఆనంద్ మ‌హీంద్రా సాయం చేస్తానంటే రిజెక్ట్ చేశాడ‌ట‌!

Update: 2019-07-15 09:38 GMT
సాయం కోసం ఎవ‌రైనా ముందుకు వ‌స్తే  ఓకే అన‌టం తెలిసిన విష‌యం. అలాంటిది సాయం చేసే వ్య‌క్తి  పారిశ్రామిక ప్ర‌ముఖుడు ఆనంద్ మ‌హీంద్రా అయితే.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. అంద‌రూ ఒకేలా ఉంటే స్పెష‌ల్ ఏముంటుంది? అందుకే.. కోరి సాయం చేయ‌టానికి ముందుకు వ‌చ్చిన వారిని సైతం నో చెప్పి ఆశ్చ‌ర్యానికి గురి చేసిన వ్య‌క్తిత్వం ప్ర‌ముఖ గ‌ణిత‌వేత్త ఆనంద్ కుమార్ గా చెప్పాలి.

ప్ర‌తి ఏటా ప్ర‌తిభావంతులైన 30 మంది నిరేపేద విద్యార్థుల‌కు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేలా సాయం చేస్తూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపే ఆనంద్ కుమార్ రియ‌ల్ జీవితాన్ని రీల్ గా సూప‌ర్ 30సినిమాలో చూపించ‌టం తెలిసిందే.

ఆనంద్ కుమార్ బ‌యోపిక్ గా విడుద‌లై సూప‌ర్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న ఈ చిత్రంంలో ఆనంద్ కుమార్ పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ న‌టించ‌టం తెలిసిందే. త‌న‌కున్న ఇమేజ్ కు భిన్నంగా ఆనంద్ కుమార్ పాత్ర‌లో ఒదిగిపోయారు హృతిక్. ఇదిలా ఉంటే.. తాజాగా ఆనంద్కుమార్ కృషి గురించి తెలుసుకున్న‌వ్యాపార దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్రా ఆయ‌న్ను వ్య‌క్తిగ‌తంగా కలిశారు.

ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి.. అభినందించిన ఆనంద్ మ‌హీంద్రా.. ఆ సంద‌ర్భంలో త‌న‌వంతు సాయాన్ని అందిస్తాన‌ని చెప్పార‌ట‌. అందుకు స్పందించిన ఆనంద్ కుమార్ నోచెప్పిన‌ట్లుగా తాజాగా త‌న ట్వీట్ తో వెల్ల‌డించారు. ఆయ‌న‌కు ఆర్థిక‌సాయాన్ని అందించాల‌ని వెళ్లాను. ఆయ‌న నా సాయాన్ని రిజెక్ట్ చేశారు. త‌న సొంతంగానే సూప‌ర్ 30 కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తాన‌ని చెప్పార‌ని.. ఆయ‌న ప‌ట్టుద‌ల చూసి త‌న‌కు చాలా ముచ్చ‌టేసింద‌న్నారు. ఆనంద్ కుమార్ కృషిని తాను అభినందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఆనంద్ మ‌హీంద్రా చేసిన ట్వీట్ కు ఆనంద్ కుమార్ రియాక్ట్ అయ్యారు. థ్యాంక్యూ స‌ర్.. మీ అభినంద‌న‌లే నాకెంతో బ‌లాన్ని ఇస్తాయ‌ని ఆయ‌న రిప్లై ఇచ్చారు. సాయం చేయ‌టమే అరుద‌నుకుంటే.. చేస్తాన‌న్న సాయాన్ని వ‌ద్ద‌ని చెప్పి.. తానే సొంతంగా సాయం చేస్తాన‌ని చెప్పే ఆనంద్ కుమార్ లాంటి వారు ఈ దేశానికి చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News