కుర్రాళ్లతో పాటు మధ్య వయస్కుల వారిల్లో ఎక్కువ శాతం మందికి డ్రీమ్ బైక్ ఏది అంటే రాయల్ ఎన్ ఫీల్డ్ అనే సమాధానం వస్తుంది. సాధారణ బైక్స్ తో పోల్చితే రేటు దాదాపు డబుల్ అయినా కూడా ఎన్ ఫీల్డ్ పై ఉన్న మోజుతో కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు. స్పోర్ట్స్ బైక్స్ రేంజ్ లో రేటు ఉన్నా కూడా ఎన్ ఫీల్డ్ బైక్ ను సొంతం చేసుకోవడం స్టేటస్ సింబల్ గా అనుకుంటూ ఉంటారు.
ఇండియాలో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఎన్నో కొత్త మోడల్స్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ అందుబాటులోకి కంపెనీ తీసుకు వచ్చింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెయికిల్స్ పెరిగి పోతున్నాయి. రాబోయే కాలం మొత్తం ఈవీలదే అవ్వడంతో రాయల్ ఎన్ ఫీల్డ్ నుండి కూడా ఈవీ రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఇప్పటికే రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీకి చెందిన టీమ్ ఈవీ లపై రీసెర్చ్ చేయడంతో పాటు తయారీ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ రాయల్ లుక్ మిస్ అవ్వకుండా చార్జింగ్ తక్కువ ఉపయోగించుకుని ఎక్కువ వేగం.. ఎక్కువ సమయం ప్రయాణించే బండ్లను తయారు చేసేందుకు టీమ్ వర్క్ చేస్తుందట.
2025 నాటికి 5 వేల ఎలక్ట్రిక్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను మార్కెట్ లోకి దించాలని కంపెనీ నిర్ణయించిందట. ఇందుకోసం 65 మంది ఉద్యోగులను ప్రత్యేక టీమ్ గా కంపెనీ నియమించింది. ఈ టీమ్ కు ఉమేష్ కృష్ణప్ప లీడ్ గా వ్యవహరిస్తున్నాడట. ఈయన గతంలో ఓలా ఎలక్ట్రిక్ వెయికిల్ తయారీ లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఎన్ ఫీల్డ్ ఈ వీ రాబోతుంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ పెట్రోల్ వర్షన్ బైక్స్ కే భారీగా రేటు ఉంది. మరి ఈవీ ఎన్ ఫిల్డ్ రేటు ఏ స్థాయిలో ఉంటుందో.. సామాన్యులకు అందనంత దూరంగా ఉంటుందా.. లేదంటే అందరికి అనుకూలమైన రేట్లలో ఉంటుందా అనేది తెలియాలంటే మరో ఏడాది కాలం ఆగాల్సిందే. వచ్చే ఏడాది బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.