మంత్రివర్గ సమావేశాలు ఒక్కో ముఖ్యమంత్రి హయాంలో ఒక్కోలా సాగుతుంటాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేబినెట్ మీటింగ్ లు టంచనుగా అన్నట్లు సాగేవి. తర్వాత వచ్చిన రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇది కాస్త తగ్గితే.. ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడే మంత్రివర్గ సమావేశం జరుగుతుందన్న విషయం మీద క్లారిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తప్పించి మరెవరికీ ఉండని పరిస్థితి.
తాజాగా కేబినెట్ మీటింగ్ తర్వాత హడావుడిగా బయలుదేరారు సీఎం కేసీఆర్. ఎందుకంటే.. దానికి కారణం లేకపోలేదు. ప్రగతిభవన్ టు ఎర్రవెల్లికి తరచూ వెళ్లే కేసీఆర్.. ఈసారి కుటుంబ సభ్యుల్ని వెంట తీసుకెళ్లారు. ఎందుకిలా? అంటే దానికి కారణం లేకపోలేదు. సీఎం కేసీఆర్ కు ఎంతో ఇష్టమైన ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఆయన కొత్త ఇంటిని భారీగా నిర్మించుకున్నట్లు చెబుతారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకూ మీడియాలో వచ్చింది లేదు. ఆ మాటకు వస్తే.. ఎర్రవెల్లి ఫాంహౌస్ కు సంబంధించిన అప్ డేట్స్ ఈ మధ్యన మీడియాలోనూ పెద్దగా రావట్లేదు. గతంలో తాను పండించే పంట గురించి.. దానికి వస్తున్న రేటు గురించి.. వ్యవసాయం ఎంత ఫలసాయమన్న ఆసక్తికర విషయాల్ని కేసీఆర్ చెప్పేవారు. ఇప్పుడు అలాంటి విషయాల మీద అస్సలు మాట్లాడటం లేదు ముఖ్యమంత్రి.
గడిచిన కొద్ది కాలంగా తరచూ ఫాంహౌస్ కు వెళ్లటం తెలిసిందే. చివరకు ఆర్టీసీ సమ్మె తీవ్రంగా సాగుతున్న వేళ సైతం ఆయన ఫాంహౌస్ కు వెళ్లి వచ్చేవారు. గతంలో మాదిరి రోజుల తరబడి కాకుండా వెళ్లిన రోజే తిరిగి వచ్చేలా ఆయన ప్రయాణాలు ఉండేవి. ఎందుకంటే.. తనకెంతో ఇష్టమైన ఫాంహౌస్ లో నిర్మిస్తున్న కొత్తింటిని సమీక్షించుకోవటానికి.. పనులు ఎలా జరుగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఆయన వెళ్లేవారన్న మాట కేసీఆర్ సన్నిహిత వర్గాల నోటి నుంచి వచ్చేవి.
ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తన ఫాంహౌస్ లో నిర్మించిన కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్నారు. దీనికి సంబంధించి ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. కేబినెట్ భేటీ అయ్యాక కుటుంబ సభ్యులందరితో కలిసి ఎర్రవెల్లికి వెళ్లారు కేసీఆర్. అన్ని విషయాలు ప్రజలతో పంచుకునే సీఎం కేసీఆర్.. ఎర్రవెల్లిలో తాను నిర్మించుకున్న కొత్త ఇంటి విశేషాల్ని ఎప్పుడు చెబుతారో?