ప్రపంచంలో ఎక్కువ మంది బిలయనీర్లు ఉండే నగరాల జాబితాని ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా చైనా తొలి స్థానం దక్కించుకుంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో బీజింగ్ మొదటి స్థానంలో ఉంది.
చైనాలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగింది. బీజింగ్ లో 33మంది బిలియనీర్లు కొత్తగా చేరగా... న్యూయార్క్ మాత్రం 7గురితోనే సరిపెట్టుకుంది. ఈ సంఖ్యతో నాలుగో స్థానంలో ఉన్న బీజింగ్ ఏకంగా తొలి స్థానానికి చేరింది. బీజింగ్ లో డాలర్ల బిలియనీర్లు 100 మంది బిలియనీర్లు ఉన్నట్లు తాజా నివేదికలో పొందు పర్చారు. న్యూయార్క్ సిటీలో వీరి సంఖ్య 99గా నమోదైంది.
సంపద పరంగా న్యూయార్క్ టాప్ లో ఉంది. న్యూయార్క్ సిటీలో మైకేల్ బ్లూమ్ బర్గ్ అత్యంత సంపన్నుడు. న్యూయార్క్ కుబేరుల సంపద 56,000 కోట్ల డాలర్లు కాగా బీజింగ్ 48,400 కోట్ల డాలర్లుగా ఉంది. ఇలా బీజింగ్ తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక టాప్ టెన్ నగరాల జాబితాలో మనదేశంలోని ముంబయి చోటు దక్కించుకుంది.
టాప్ టెన్ నగరాల్లో భారత్ ఆర్థిక రాజధాని ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ టాప్ 10 నగరాల్లో ఐదు చైనాకు చెందినవే కావడం గమనార్హం. బీజింగ్ తొలి స్థానంలో ఉండగా న్యూయార్క్ సిటీ, హాంకాంగ్, మాస్కో, షెంజెన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.