తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల ముందు వరకు పెద్దగా బలం లేని బీజేపీ, ఇప్పుడు రాష్ట్రంలో వేగంగా పుంజుకుంటోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనే బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఇక అక్కడనుంచి చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. టీఆర్ఎస్ కంచుకోట అయిన దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లోనూ కారుకు చుక్కలు చూపించింది.
ఇలా బీజేపీ గ్రాఫ్ పెరగడానికి కారణాలు లేకపోలేదు. టిఆర్ఎస్ అధినాయకుడు, సీఎం కేసీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్‌ని వీక్ చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళ్లారు.
దీంతో తెలంగాణలో బీజేపీకి పుంజుకోవడానికి ఛాన్స్ వచ్చింది. దీంతో దుబ్బాక గెలుపుతో పాటు గ్రేటర్‌లో కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టేసింది. ఇక అక్కడనుంచి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా రాజకీయాలు మారిపోయాయి. ఆ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు ఒక్కటే అని, రాజకీయంగా కేసీఆర్, బీజేపీలు డ్రామా ఆడుతున్నాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు బండి సంజయ్ పెద్ద ఎత్తున కేసీఆర్‌పై విమర్శలు చేశారని, ఆయన అవినీతిని బయటపెడతామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని హడావిడి చేశారని అంటున్నారు. అలా విమర్శలు చేసి జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకుని, తర్వాత లైట్ తీసుకున్నారని అంటున్నారు.
ఇదే విషయంలో పశ్చిమబెంగాల్‌కు వచ్చేసరికి శారద కుంభకోణంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులని, ఎమ్మెల్యేలని అరెస్ట్ చేశారని, కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి కనబడటం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేస్తుందని ఆరోపిస్తున్నప్పుడు ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నాయకులని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదంతో వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తామని రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మొత్తానికైతే పరోక్షంగా బీజేపీ-కేసీఆర్‌కి క్లీన్‌చిట్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. బీజేపీ నాయకులు కేసీఆర్ విషయంలో మాటల వరకు తూటాలు పేలుస్తున్నా నిజంగానే వాళ్లు అవినీతి చేస్తే చేతలకు వచ్చే సరికి మాత్రం బేలచూపులు చూస్తోన్న పరిస్థితే ఉంది.