ఏపీలో మరో ఎన్నికల సందడి నెలకొంది. వరుస ఎన్నికలతో ప్రజాప్రతినిధులు, ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. పంచాయతీ, మున్సిపల్, జడ్పీ ఎన్నికల ఊపులోనే తాజాగా ఏపీలో ఖాళీ కాబోతున్న 6 ఎమ్మల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం బలం పరంగా చూస్తే ఈ ఆరు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో సీఎం జగన్ ఎవరికి చాన్స్ ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం వైసీపీలో ఈ ఆరు ఎమ్మెల్సీ సీట్ల కోసం పలువురు పోటీ పడుతున్నారు. లేళ్ల అప్పిరెడ్డి - మర్రి రాజశేఖర్ - షేక్ ముజుబుల్ రెహమాన్ - మోషేన్ రాజు - తోట త్రిమూర్తులు - కూడిపూడి చిట్టబ్బాయ్ - తోట వాణి - బల్లి చక్రవర్తి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఈ ఆరు పదవులపై తుది నిర్ణయం సీఎం జగన్ పై ఆధారపడి ఉంది. ఇప్పటికే జగన్ వీటిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఒక పదవిని టాలీవుడ్ సినీ సెలబ్రెటీలకు ఇచ్చే యోచనలో జగన్ ఉన్నాడట.. ఎన్నికల వేళ మోహన్ బాబు - అలీ - జీవితా రాజశేఖర్ - ఫృథ్వీ సహా చాలా మంది పాటుపడడంతో ఆ దిశగా జగన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.