రాజకీయాల లోకి వచ్చిన ప్రతి ఒక్కరు రాజకీయ నేతలు మాత్రమే కాగలరు. కానీ , ప్రజా నాయకుడు కాలేడు. ప్రజా సమస్యలపై పోరాడి, వారి సమస్యలని తన సమస్యగా భావించి , ఆ సమస్యని తీర్చిన వాడే ప్రజా నాయకుడు అవుతాడు. అలాంటివారు రాజకీయాలలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇక పొతే మరి కొందరు పార్టీ కి ఏ సమయంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా నేనున్నా అంటూ ముందుకి వచ్చి ... పార్టీ సమస్య ని తీర్చే ట్రబుల్ షూటర్ లు కొంతమంది ఉంటారు. ట్రబుల్ షూటర్ అనగానే అందరికి గుర్తొచ్చే పేరు ..తెలంగాణ మంత్రి హరీష్ రావు..ఎన్నో సార్లు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనదైన శైలి లో ఆ సమస్య ని పరిష్కరించి ..ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు.
ఇక ఏపీ లో ట్రబుల్ షూటర్ ..అదే స్థాయి లో పేరు తెచ్చుకున్న నేత ఎవరైనా ఉన్నారా ఆంటే ...అది కచ్చితంగా వైసీపీ సీనియర్ నేత , మంత్రి బొత్స సత్యనారాయణ అని చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం లో అత్యంత సీనియర్ మంత్రి. సమస్య ఏదైనా, బొత్స రంగంలోకి దిగారంటే, అది క్లియర్ కావాల్సిందే ట్రబుల్ షూటర్ గా జగన్ ప్రభుత్వం లో పేరు తెచ్చుకున్నారు బొత్స. అయితే, సొంత జిల్లా లో అ సంతృప్తి రగలడం తో సతమతమై పోయారట బొత్స సత్యనారాయణ. కానీ ఆ అ సమ్మతులను, అ సంతృప్తులను వెను వెంటనే దారిలోకి తేవడం లో తనకు తిరుగు లేదని మరోసారి నిరూపించుకున్నారట బొత్స.
2019 ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకు తొమ్మిది స్థానాలు సాధించిన వైసిపికి, విజయనగరం జిల్లా కంచుకోట గా మారింది. అయితే ఈ విజయానికి కీలక పాత్ర పోషించింది రాష్ట్ర మంత్రి బొత్స సత్యన్నారాయణ. ఆయన రాజకీయ చతురత తో జిల్లాలోని మహా మహులైన నాయకులను సైతం మట్టికరిపించి వైసిపి అభ్యర్థుల గెలుపుకు కారణమయ్యారు. అప్పటివరకు వర్గపోరుతో సతమతమౌతున్న వైసిపిలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీ గెలుపుకు కష్టపడాలని ఆదేశించడంతో, జిల్లా లోని ముఖ్య నాయకులంతా ఏకతాటి పైకి వచ్చి, పార్టీ నిర్ణయించిన అభ్యర్దులు గెలు పొందేలా కృషి చేశారని పేరు తెచ్చుకున్నారు బొత్స
విజయనగరం జిల్లా లో తొమ్మిది స్థానాలు ఉండ గా, అందు లో ఆరు స్థానాల్లో తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు టిక్కెట్లు సాధించి వారందరూ గెలుపొందేలా చేసుకున్నారు బొత్స. అప్పటి వరకు పార్టీని నమ్ముకున్నవారికి టిక్కెట్లు రాకపోవడంతో, వారంతా నిరాశలో కూరుకుపోయారు. అయితే వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చి, ఒప్పించడంలోనూ నాడు సక్సెస్ అయ్యారు బొత్స. అయితే ఎన్నికల అనంతరం సీన్ మళ్లీ రివర్సయ్యిందట. ఈమధ్య వాలంటీర్ల నియామకాల్లో తమ వారినే నియమించాలని, స్థానిక ఎంఎల్ఎ మాటను సైతం కాదని తమవారికే నియామకం చేపట్టాలని జిల్లాలోని ముఖ్య నాయుకులు పట్టు పట్టడంతో, గొడవలు పెరిగాయి. జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యే లు కొన్ని నెలలుగా బొత్సకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారట
అందరూ కలిసి బొత్స వ్యతిరేకవర్గంగా ఏర్పడేందుకు ట్రై చేశారట. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న బొత్స, జిల్లా నేతలతో, ముఖ్య నాయకుల తో ప్రత్యేక సమావేశం జరిపి, వారివారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కొరకు సూచనలు ఇవ్వడంతో గ్రూపు రాజకీయాల కు తెర పడిందట. విజయనగరం జిల్లా లో వైసిపి కి పెద్ద దిక్కు గా ఉంటూ ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా వాటిని పరిష్కారం చేస్తూ అందర్నీ ఏకతాటిపైకి తెస్తూ జిల్లా వైసిపికి తానే నాయకుడై నడిపిస్తున్నారు బొత్స