ఎండాకాలం పోతోంది.. వచ్చేది వర్షాకాలం.. జులైలో వానలు మొదలవుతాయి. దాంతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఇంత వేడిలోనూ డేంజర్ గా దేశంలో విస్తరిస్తున్న కరోనాకు సరైన సమయం ఈ వ్యాధుల సీజనే. దీంతో వర్షకాలంలో భారత్ లో కరోనా డేంజరస్ గా ఉంటుందని.. ఇండియాకు పెను ముప్పు ముందుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
భారత దేశంలో కరోనా తీవ్రత జులైలో బాగా పెరుగుతుందని.. ఆ నెలలో కేసుల సంఖ్య ఊహకందదని ప్రపంచ ఆరోగ్యసంస్థ భారత రాయబారి డేవిడ్ నబారో చెప్పారు.
ప్రస్తుతం భారతలో కేసులు స్థిరంగా ఉండడానికి వేసవి , ఉష్ణోగ్రతలు కారణమని ఆయన తెలిపారు. ప్రభుత్వం అప్రమత్తత కారణంగా కరోనా అదుపులో ఉందన్నారు. అసలు ముప్పు వచ్చేజులైలో ఉంటుందని హెచ్చరించారు.
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని డేవిడ్ నబారో తెలిపారు. ఇంకొంత కాలం లాక్ డౌన్ ను పొడిగించడం ద్వారా భారత్ లో కరోనాను పూర్తి స్థాయిలో కరోనాను కట్టడిచేయవచ్చని సూచించారు.