సోషల్ మీడియా దిగ్గజ సంస్థల్లో ఇన్ స్టాగ్రామ్ ఒకటి. అత్యంత తక్కువ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్ గుర్తింపు పొందింది. 2010 సంవత్సరంలో అమెరికాకు చెందిన కెవిన్ సిస్ట్రోమ్.. మైక్ క్రిగెర్ ఇన్ స్ట్రాను ప్రారంభించారు. దీనిని ఐజీ అని లేదా ఇన్ స్ట్రా అని కూడా పిలుస్తారు.
ఫోటోలు.. వీడియోలు.. రీల్స్ వంటివి అప్ లోడ్ చేసుకునేందుకు ఇన్ స్టాగ్రామ్ ను రూపొందబడింది. 2010 నుంచి 2012 వరకు ఇన్ స్టాగ్రామ్ కేవలం ఐఓఎస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ ను తీసుకొచ్చారు. వినియోగదారుల సౌకర్యార్థం ఇన్ స్ట్రాలో మీడియా ఫైల్స్ కి ఫిల్లర్స్.. హ్యాష్ ట్యాగ్స్.. లొకేషన్ వంటివి జోడించవచ్చు.
సంక్షిప్త సందేశాలు.. బహుళ చిత్రాలు.. వీడియోలను పెట్టడం.. రీల్స్.. స్టోరీస్ వంటి ఫీచర్స్ ఇన్ స్టాలో వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కంటెంట్ ను చూడవచ్చు. అలాగే తమకు నచ్చిన ఫొటోలను లైక్ చేయచ్చు.. కామెంట్.. ఫీడ్ బ్యాక్ చేయడంతోపాటు ఫాలో అనుసరించే సదుపాయం ఇన్ స్టాలో ఉంది.
ఇన్ స్టాలో పొందుపరిచే స్టోరీస్ 24 గంటలపాటు ఫాలోవర్స్.. ఇతరులు చూసే అవకాశం ఉంది. యూజర్ ఫ్రెండ్లీగా ఇన్ స్ట్రాగ్రామ్ ఉండటంతో ఈ ప్లాట్ ఫామ్ లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. 2019 మే నాటికి ఇన్ స్ట్రాలో ఏకంగా ఒక బిలియన్ వినియోగదారులు చేరారు. మొబైల్ యాప్స్ లో అత్యధికంగా డౌన్ చేసుకున్న నాలుగోదిగా ఇన్ స్టాగ్రామ్ రికార్డు సృష్టించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్ట్రాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. కొత్త రకమైన సెలబ్రెటీలను సృష్టించడానికి ఈ యాప్ ఎంతగానో దోహదపడుతోంది. దీనిలో భాగంగానే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మనం స్క్రోల్ చేసే విధానాన్ని.. మనం పొందే వినోదాన్ని సైతం మార్చి వేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్‌లు వినియోగదారులకు వస్తువులను విక్రయించేలా కూడా ఇన్ స్ట్రాను మార్చివేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వారిపై చర్చ నడుస్తోంది. వీరిలో ఇన్ స్టాగ్రామ్ 563 మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ప్రముఖ ఫుల్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో ఉన్నారు. ఆయన ఫాలోవర్స్ సంఖ్య 493 మిలియన్లుగా ఉంది.
ఆ తర్వాత కైలీ జెన్నర్ అనే అమెరికన్ వ్యాపారవేత్త 372 మంది మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. నాలుగో స్థానంలో మెస్సీ(సాకర్) 370 మిలియన్.. అమెరికన్ సింగ్ సెలీనా గోమేజ్ 354 మిలియన్.. రెజ్లర్ కమ్ యాక్టర్ డ్వెయిన్ జాన్సన్ 345 మిలియన్.. అమెరికన్ సింగర్ గ్రాండే 337 మిలియన్.. మోడల్ కమ్ వ్యాపారవేత్త కిమ్ కర్ధాషియన్ 333 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.