సార్వత్రిక సమరం.. అధికారంలో ఉన్న టీడీపీ ఒకవైపు.. అప్పటికే 10ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మరోవైపు.. కానీ ఒకే ఒక్కడు ఒంటరిగా పోరాడారు. బలమైన టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించాడు. ప్రచారాన్ని హోరెత్తించారు. ఇన్ని రోజుల ప్రచారంలో జగన్ కు తోడుగా వారు వెన్నంటే ఉన్నారు. జగన్ ప్రచారం లో అనునిత్యం వెన్నంటే ఉండి 20 రోజులపాటు నలుగురూ వ్యక్తులు కీలకపాత్ర పోషించారు. వారెవరు? వారి విధులు ఏమిటో తెలుసుకుందాం..
1. GVD కృష్ణమోహన్ : వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీడియా వ్యవహారాలు చూసే కృష్ణమోహన్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీరోజు పాల్గొనే వార్తల వివరాలని మీడియాకు తెలియచేయడం.. మీడియా ద్వారా ప్రచారం చేయడం.. ఇతర పార్టీ నాయకుల విమర్శలు.. వాటిపై విశ్లేశించడం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాలకు అవసరమైన వివరాలు సమకూర్చడం ఈయన విధి.
2. తలశిల రఘురాం : వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి కార్యక్రమాల నిర్వహణ రఘురాం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఓదార్పుయాత్ర - విజయమ్మ ఉపఎన్నికల ప్రచారం, షర్మిల, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలతోపాటు గత ఎన్నికలలో ప్రచారం కూడా ఈయనే చూసారు. ఈ ఎన్నికలలో కూడా అను నిత్యం వెన్నంటి ఉండి జగన్ కు అండగా ఉన్నారు.
3. కేఎన్ ఆర్: వ్యక్తిగత కార్యదర్శిగా నిత్యం జగన్ వెన్నంటే ఉంటారు. జగన్ వ్యక్తిగత, ప్రచార, రాజకీయ వ్యవహారాల్లో సహాయకారిగా సేవలందిస్తారు. గత ఎన్నికలలో కూడా ఈ ముగ్గురు ఆయనతోపాటు హెలీక్యాప్టర్ లో వెంట ఉండడం విశేషం.
4 .ట్రంప్ అవినాష్ : అమెరికా ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా పనిచేసిన ఒక టీంలో సభ్యుడిగా అవినాష్ ఉన్నాడు. ఇతను కొద్దికాలంగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకడిగా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో పాటు పరిశీలించడం ఈయన పని.
ఇలా ఈ నలుగురి వైసీపీ అధినేత జగన్ కు తోడుగా, నీడగా ఉంటూ సముద్రంలాంటి ఏపీ ఎన్నికల నావను ఒడ్డుకు చేర్చుకున్నారు. గెలుపు ఆశలు చిగురించడంలో వీరి పాత్ర కీలకంగా ఉంది.