'బినోద్' ఎవరు, సోషల్ మీడియాలో తెగ ట్రెండ్

Update: 2020-08-12 07:10 GMT
సోషల్ మీడియాలో బినోద్ అనే పేరు బాగా ట్రెండ్ అయింది. ఈ పేరుతో జోక్స్, మీమ్స్ వచ్చాయి. అభ్యుదయ, గౌతమి కవాలే అనేవారు స్లేవీ పాయింట్ అనే వీడియోను షేర్ చేశారు. ఇండియన్ యూట్యూబ్ వీడియోస్ షేర్ చేసే సమయంలో బినోద్ పేరు తెరపైకి వచ్చింది. జూలై 15న షేర్ చేసిన వీడియోలో ఈ పేరు ప్రత్యేకంగా వచ్చింది. పూర్తిపేరు బినోద్ థాకూర్. యూట్యూబ్ అకౌంట్‌ లో మాత్రం బినోత్ థార్ అని ఉంది. అయితే ఇందులో వీడియోలు ఉండవు.

కేవలం యూట్యూబ్ ఫాలో కావడం, కామెంట్స్ చేయడమే. దీంతో బినోత్ ట్రెండ్ అయింది. పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. బ్రాండ్స్, కంపెనీలు పోలీసు విభాగాలు కూడా ఈ పేర్లు ఉపయోగించుకున్నాయి. పేటీఎం, నెట్‌ఫ్లిక్స్, టిండర్ కూడా ఈ మీమ్స్‌లో జత కలిశాయి. చాలామంది బినోద్ పేరును ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేయడం తో ప్రారంభమైన బినోద్ పేరు ట్విట్టర్‌ లోను ట్రెండ్ అయింది. ముంబై పోలీసులు అయితే డియర్ బినోద్.. మీ పేరుకు ఆన్‌లైన్ పాస్‌వర్డ్ లేకుండా పోయిందని పేర్కొనడం వైరల్‌గా మారింది.

2020లో కరోనా మహమ్మారి ప్రపంచానికి సవాల్‌గా నిలిచింది. దీనికి తోడు భూకంపాలు, గ్యాస్ లీక్, అడవుల్లో మంటలు తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో కొన్ని ఫన్‌ ను పంచుతున్నాయి. అంతకు ముందు మైక్వారంటైన్ ఇన్ సిక్స్ వర్డ్స్, ఐ హావ్ ఏ జోక్ దట్ కెప్ట్ ది పీపుల్ ఇన్ హై స్పిరిట్ గతంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆగస్ట్‌ లో బినోద్ ట్రెండ్ అయింది.
Tags:    

Similar News