కేసీఆర్ ఎదుగుద‌ల ఎవ‌రికి అడ్డంకి?

Update: 2022-02-15 09:31 GMT
జాతి కోసం జాతీయ పార్టీ పెడ‌తానని అంటూ కేసీఆర్ హ‌డావుడిగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు.త‌రువాత ప్ర‌జా ఫ్రంట్ ఏర్పాటులో ఆయ‌న కీల‌కం కానున్నార‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.మ‌రోవైపు బీజేపీయేత‌ర ముఖ్య‌మంత్రుల‌ను క‌లుపుకుని పోవ‌డంలో కేసీఆర్ శ్ర‌ద్ధ చూపిస్తున్నారు.ఈ క్ర‌మంలో మ‌మ‌తా బెన‌ర్జీకి స్నేహాస్తం చాటారు.రేపో మాపో బీహారు దారుల‌కు పోనున్నారు.ఒడిశా దారుల‌కు రానున్నారు.

ఏ విధంగా చూసినా ఆయ‌న కాంగ్రెస్ తో క‌లిసి ప‌నిచేయ‌రు. కాంగ్రెస్ పొడ గిట్ట‌ని, బీజేపీ అంటే ప‌డ‌ని నాయ‌కుల‌తో ఆయ‌న ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారు.

ఈ లెక్క‌న కేజ్రీతోనూ ఆయ‌న క‌లుస్తారు.ఇక ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఇంకొంత స్ప‌ష్ట‌త వ‌స్తుంది క‌నుక ఆయా ప్రాంతాల‌లో అధికారం చేజిక్కించుకున్న నేత‌ల‌తో, ముఖ్య పార్టీల నాయ‌కుల‌తో మాట్లాడేందుకు కేసీఆర్ ఇష్ట‌ప‌డుతున్నారు.ఓవిధంగా జాతీయ నేత గా త‌న‌ని తాని అభివ‌ర్ణించుకునే స్థాయికి చేరుకునేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.

ఈ క్రమంలో పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కేసీఆర్ రాక‌కు సంబంధించి పెద్ద  చ‌ర్చ‌నే న‌డుస్తోంది.ఎందుకంటే ఆయ‌న రాక అటు చంద్ర‌బాబుకు,ఇటు జ‌గ‌న్ కు ఏ విధంగా చూసుకున్నా ఇబ్బందే!వారి ఉనికికి స‌మ‌స్యే! క‌నుక కేసీఆర్ ఒక‌వేళ జాతీయ పార్టీ పెడితే జ‌న‌సేన‌తో కూడా ఆయ‌న క‌లిసి ప‌నిచేయొచ్చు కానీ చంద్ర‌బాబుతో మాత్రం ఆయ‌న ఉండ‌ర‌ని అంటున్నారు కొంద‌రు.

ఇంకొంద‌రు మాత్రం జ‌గ‌న్ తో క‌లిసి ప‌నిచేసేందుకు కేసీఆర్ కు ఉన్న అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నా, వైసీపీ త‌ర‌ఫు స్నేహం బీజేపీ ఖాతాలో ఉంది క‌నుక ఆ అవ‌కాశం తెలంగాణ పెద్దాయ‌న‌కు చిక్క‌క‌పోవ‌చ్చు అని కూడా అంటున్నారు. ఈ ద‌శ‌లో చంద్ర‌బాబే ఆయ‌న‌కు కేరాఫ్ కావొచ్చు. ఇక జ‌న‌సేన కూడా ఎప్ప‌టి నుంచో కేసీఆర్ తో మంచి బంధాలనే న‌డుపుతుంది క‌నుక ఆ పార్టీ విష‌య‌మై కేసీఆర్ కు లైన్ క్లియ‌ర్ కావొచ్చు. కానీ చంద్ర‌బాబుకు మాత్రం కేసీఆర్ కార‌ణంగానే ప్ర‌మాదం పొంచి ఉంది అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.

పొత్తుల ఎత్తుగ‌డ‌ల్లో గ‌తంలో ప‌వ‌న్ కు ఇబ్బంది పెట్టిన బాబు ఇప్పుడు కేసీఆర్ తో స్నేహం చేస్తే, ఆయా సంద‌ర్భాల్లో పసుపు పార్టీ పెద్ద‌ల మాట చెల్ల‌దు గాక చెల్ల‌దు. క‌నుక ఏ విధంగాచూసుకున్నా ఓట్ల చీలిక అన్న‌ది అటు జ‌న‌సేన‌తోనూ,ఇటు కేసీఆర్ తోనూ సాధ్యం కావొచ్చు. క‌నుక చంద్ర‌బాబు వ‌ర్గాలలో ఇప్ప‌టి నుంచే గుబులు రేగుతోంది.అయితే జాతీయ పార్టీ పెడ‌తాను అన్న మాట కేసీఆర్ చెప్పంగానే ఇటు ఆంధ్రాలో నాయ‌కులెవ్వ‌రూ స్పందించ‌లేదు.అలానే త‌మిళ నాట కూడా పెద్ద‌గా స్పంద‌న‌లేదు.
Tags:    

Similar News