భార‌త్ లో క‌రోనా.. WHO కీల‌క నిర్ణ‌యం!

Update: 2021-04-27 08:35 GMT
ఇండియాలో కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తూనే ఉంది. కేసులు ల‌క్ష‌లాదిగా న‌మోద‌వుతూనే ఉన్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ మార‌ణ‌హోమాన్ని ఎలా అదుపులోకి తీసుకురావాలో అర్థంకాక ప్ర‌భుత్వాలు త‌ల‌ప‌ట్టుకుంటున్నాయి. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. కేసుల పెరుగుద‌ల మాత్రం ఆగ‌ట్లేదు.

ఈ ప‌రిస్థితిపై.. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (WHO) కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తంచేసింది. భారత్ లో క‌రోనా ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించింది. ప్ర‌స్తుతం ఇండియాను చూస్తుంటే.. హృద‌య‌విదార‌కంగా అనిపిస్తోంద‌ని WHO చీఫ్ టెడ్ర‌స్ అథ‌నోమ్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

ఈ కండీష‌న్లోంచి భార‌త్ ను గ‌ట్టెక్కించ‌డానికి త‌న‌వంతు స‌హ‌కారం అందించేందుకు WHO ముందుకు వ‌చ్చింది. ఇందులో భాగంగా.. 2,600 మంది వైద్య నిపుణుల్ని భార‌త్ కు పంపించేందుకు సిద్ధ‌మైంది. వీరంతా త్వ‌ర‌లోనే ఇండియా చేరుకొని, వైద్య స‌హాయం అందిస్తార‌ని అథ‌నోమ్ ప్ర‌క‌టించారు.

ఇదిలాఉంటే.. దేశంలో కేసుల తీవ్ర‌త మ‌రోసారి మూడున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరింది. గ‌డిచిన 24 గంటల్లో 3.52 ల‌క్ష‌ల కొత్త కేసులు న‌మోద‌య్యాయి. 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆసుప‌త్రుల్లో రోగుల‌కు ప‌డ‌క‌లు ల‌భించ‌క‌పోగా.. చ‌నిపోయిన వారికి శ్మ‌శానాల్లోనూ చోటు ద‌క్క‌ట్లేదు. శ్మ‌శాన వాటిక‌ల సామ‌ర్థ్యానికి మించి నాలుగు రెట్ల శ‌వాలు వ‌స్తుండ‌డంతో.. ఢిల్లీ లాంటి చోట ద‌హ‌నానికి రెండు మూడు రోజుల స‌మ‌యం ప‌డుతోంది.
Tags:    

Similar News