కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై డబ్ల్యూ.హెచ్.వో చేస్తున్న విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ప్రమాదకర గబ్బిలాల గుహలపై చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన మానవాళికి ముప్పుగా మారిందని తెలుస్తోంది. చైనా చేస్తున్న దారుణ ప్రయోగాలే ప్రపంచానికి పెను విఘాతంగా మారిందని అంటున్నారు.
సరికొత్త వైరస్ లపై పరిశోధన చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు చేసిన అశ్రద్ధ వల్లే ఇప్పుడు కరోనా ప్రపంచానికి అంటుకుందని డబ్ల్యూహెచ్.వో తాజా నివేదికల్లో తేలినట్టు సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) నిబంధనలను పాటించకుండా.. గ్లోవ్స్, మాస్క్ లు ధరించకుండా ఓ గబ్బిలాల గుహలోకి వెళ్లారని బయటపడింది. ఈ గుహలో కరోనా సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్టు వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు అంగీకరించారట.. దీంతో చైనా శాస్త్రవేత్తల ప్రయోగాలే ఇప్పుడు ప్రపంచానికి శాపంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడైంది.
చైనాలోని వూహాన్ వైరాలజీ శాస్త్రవేత్తలు గతంలో ఓ గుహలోకి వెళ్లి గబ్బిలాల నమూనాలు సేకరించారట.. కరోనా వైరస్ సోకిన గబ్బిలాలకు కేంద్రంగా ఆ గుహ ఉంది. ఈ నమూనాల సేకరణలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తమను ఈ వైరస్ సోకిన గబ్బిలాలు కుట్టినట్లుగా అంగీకరించారని ఆదివారం అంతర్జాతీయ మీడియా తెలిపింది. తన రబ్బర్ గ్లోవ్స్ లోకి ఓ గబ్బిలం కోర సూదిలాగా గుచ్చుకుందని ఓ శాస్త్రవేత్త చెప్పారని మీడియా తెలిపింది.
డబ్ల్యూ.హెచ్.వో మార్గదర్శకాలను పాటించకుండా గబ్బిలాలతో చైనా శాస్త్రవేత్తలు వ్యవహరించారని చైనీస్ టీవీ సిబ్బంది సేకరించిన వీడియోలో బయటపడింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇప్పటికే కరోనా వైరస్ ను పుట్టించిందని చైనాయేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం వూహాన్ లో పర్యటిస్తోంది. కరోనా పుట్టిన సిటీలో బృందం క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది. ఈ విచారణలో చైనా శాస్త్రవేత్తలే కరోనా వ్యాప్తికి కారణమని.. గబ్బిలాల గుహలోకి వెళ్లి మనుషులకు ఈ కరోనా వైరస్ ను అంటించడానికి కారణమయ్యారని విచారణలో తేలింది.