'ఆర్కే' శకం ముగిసింది.. మరి ఆయన వారసులు ఎవరు?

Update: 2021-10-17 07:17 GMT
సిద్ధాంతాల్ని నమ్ముకొని.. దానికి తగ్గట్లు నడుచుకోవటం.. ఆ బాటలోనే పయనించటం.. ఎన్ని కష్టాలు వచ్చినా.. మరెన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకోవటం.. పాలకుల దాష్టీకాలకు ఎదురొడ్డి నిలవటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మరణం ఇప్పుడా పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సాధారణ కార్యకర్త నుంచి అతన్ని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగేందుకు సాయం చేసింది.

నల్లమల అటవీప్రాంతంలో గెరిల్లా జోన్ల ఏర్పాటు మొదలు ఆంధ్రా -ఒడిశా సరిహద్దుత్లో కటాప్ ఏరియాల వరకు తన వ్యూహాల్ని అమలు చేసిన ఆయన.. మావో పార్టీ తరఫున ప్రభుత్వంతో చర్చల ప్రతినిధిగా సుపరిచితుడు. ప్రజాజీవితంలోకి వచ్చిన మూడు రోజులు ఆయన వ్యవహారశైలి ఎందరి మీదనో ప్రభావాన్ని చూపింది. తమ సమస్యల పరిష్కారం కోసం మావో పార్టీ ప్రతినిధిగా వచ్చిన ఆర్కేకు వేలాది వినతులు రావటం అప్పట్లో సంచలనమైంది.

అయితే..  చర్చల కోసం బయటకు వచ్చిన ఆయనకు కొత్త సవాళ్లు ఎదురు కావటమే కాదు.. దాని నుంచి బయటపేందుకు ఆంధ్రా -ఒడిశా సరిహద్దుల్లోకి వెళ్లిపోయేలా చేసింది. అక్కడ నుంచి తన మార్కు రాజకీయ వ్యూహాల్ని అమలు చేశారని చెబుతారు. రామగూడ ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడినా.. తన కొడుకు ఎన్ కౌంటర్ లో మరణించినా.. ఎవోబీ కేంద్రంగా పని చేస్తూ తనకున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని చెప్పారని చెబుతారు.

అలాంటి ఆయన మరణించటం.. ఆయన స్థానాన్ని భర్తీ చేసేదెవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటన్న దానిపై అన్ని వర్గాల వారు ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. పోలీసులు సైతం తదుపరి ఎవరు? అన్న దానిపై ద్రష్టి పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్కే స్థానానికి వారసులుగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవారు గణేశ్.. సుధాకర్.. పద్మక్కలు. ప్రస్తుతం గణేశ్ కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరిస్తున్నారు. పద్మక్క ఓడిశా కమిటీ బాధ్యతల్ని అప్పజెప్పారు. ఇక..సుధాకర్ విషయానికి వస్తే ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. చర్చల వేళ ఆర్కేతో పాటు వచ్చిన ఆయన్ను.. మీడియా కారణంగా ఆయన్ను గుర్తించారు. ఆ తర్వాత నుంచి ఆయన ఆచూకీ లేకుండాపోయింది.

అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్నది ఇప్పటివరకు సమాచారమే లేదు. కొందరు బెంగాల్ లో ఉన్నారని చెబితే.. మరికొందరు ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటారని చెబుతారు. 2017లో కోరాపుట్ లో జరిగిన ఎన్ కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లుగా చెబుతారు. గడిచిన రెండేళ్లుగా దండకార్యణంలో ఉన్నట్లు చెబుతారు. ఇప్పుడునన పరిస్థితుల్లో సుధాకర్ కే పదవీ బాధ్యతలు అప్పజెప్పే వీలుందంటున్ానరు. 1998 నుంచి 2004 వరకు ఏవోబీకి కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉన్న వేళ.. ఆయన అయితేనే సరిపోతారన్న మాట వినిపిస్తోంది. పోలీసుల అంచనా ప్రకారం కూడా.. గణేశ్.. పద్మక్కల కంటే కూడా సుధాకర్ కే ఎక్కువ  అవకాశాలు ఉన్నాయన్న మాటను చెబుతున్నారు. ఆయనకే ఈ ప్రాంతం మీద పట్టు ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి. 
Tags:    

Similar News