నేనే అంబాని.... బాబు !

Update: 2018-12-15 01:30 GMT
నా విజయం వెనుక నా భార్య ఉంది... ఇది ఒక భర్త గర్వంతో చెప్పె మాట.
నా విజయం వెనుక నా తల్లిదండ్రులున్నారు... ఇది ఒక కుతూరు లేదా కొడుకు గౌరవంతో చెప్పే మాట.
నా విజయం వెనుక నా భర్త ఉన్నాడు... ఇది ఒక భార్య ఆప్యాయతతో చెప్పే మాట...

భారతీయ జనతా పార్టీ ఓటమి వెనుక నేనే ఉన్నాను.. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట.

చెప్పే వాడికి వినేవాడు లోకువ... ఇదే పాత నానుడే అయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే మనకు గుర్తుచేస్తున్న సామెత. ప్రపంచంలో ఎవరైనా సరే ఫలానా విజయం వెనుక నేనున్నాను అని చెప్పుకోవడం విన్నాము కాని... ఓటమి వెనుక నేనే ఉన్నాను అని చెప్పుకోవడం విన్నామా... ఇప్పుడు వింటున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌ మంత్రి నారా చంద్రబాబు నాయుడికి గీతలో క్రిష్ణుడంతటి వాటిని అనుకుంటున్నారేమో... అందుకే ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా కూడా "అంతే నేనేష‌, "అన్నీ నేనే" అని ప్రభోదిస్తున్నారు.

ఇంతకీ విషయ‌మేమిటంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గడ్- రాజస్దాన్- మధ్యప్రదేశ్- మిజోరాం  రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో  మధ్య‌ ప్రదేశ్. ఛత్తీస్‌ఘడ్, రాజస్దాన్లలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీపై విజయం సాధించింది. ఈ ఎన్నికలతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ విజయాన్ని తన అకౌంట్లోకి వేసుకుందామనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన విశాఖ జిల్లా తగరపువలసలో జరిగిన సభలో మాట్లాడుతూ "నా వల్లే ఆ మూడు రాష్ట్రాలలో బీజేపీ చిత్తుగా ఓడింది. ఆ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఎంతో ఉంది" అని అన్నారు. తలాతోకా లేని ఈ వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు నోళ్లువెళ్ల‌బెట్టారు. అసలు బాబుకు, ఆ మూడు ఎన్నికలకు సంబంధం ఏమిటో, చంద్రబాబు నాయుడి ఎందుకిలా మాట్లాడుతున్నారో ఎవరికీ అర్దం కాలేదు.

బాబుకు ఈ మధ్య చిత్తచాంచల్యం ఏమైన వచ్చిందా అని అనుకునే ప‌రిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తును సమర్దించుకున్నారు. తన బావమరిదియైన నందమూరి హరిక్రిష్ణ చావును, రాజకీయ వేదికగా చేసుకున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. ఆ రోెజు తాను పొత్తులు గురించి మాట్లాడలేదని, మోదీ ప్రభుత్వం పై పోరాటానికి చేతులు కలపమని అడిగానని అన్నారు. ఏదైతేనేం చంద్రబాబు నాయుడి మాటలు.. చేతలు తెలుగుదేశం నాయకులను ఇరుకున పెడుతున్నాయి, అభిమానుల‌ను బాధిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News