సెన్సేష‌న్‌: క‌మ్యూనిజం మాటున కార్పొరేట్ శ‌క్తులు..

Update: 2020-12-14 14:30 GMT
క‌మ్యూనిజం మాటున కార్పొరేట్ శ‌క్తులు పెరిగిపోతున్నాయా?  పేద‌ల‌కు చేరువ కావాల్సిన క‌మ్యూనిస్టులు కార్పొరేట్ శ‌క్తులకు చేరువ అవుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు జాతీయ స్థాయి విశ్లేష‌కులు. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. దేశ‌వ్యాప్తంగా క‌మ్యూనిస్టుల ప్ర‌భ నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు పార్ల‌మెంటులో ప‌దుల సంఖ్య‌లో ఉన్న క‌మ్యూనిస్టు స‌భ్యులు.. నేడు ఒక‌టి అరా ఉంటేనే ఎక్కువ అనుకునే ప‌రిస్థితికి దిగ‌జారిపోయింది. ఇక‌, ద‌శాబ్దం కింద‌టి వ‌ర‌కు మూడు నాలుగు రాష్ట్రాల‌ను ఏలిన క‌మ్యూనిస్టులు.. ఇప్పుడు ఉనికినిసైతం కోల్పోతున్నారు. మ‌రి దీనికి కార‌ణాలు ఏంట‌నే విష‌యం ఆస‌క్తిగా ఉంది.

అయితే.. కార‌ణాలు సోధించే ప‌నిని దాదాపు ఇప్పుడు క‌మ్యూనిస్టులు ప‌క్క‌న పెట్టేశారు. ప్ర‌స్తుతం నెల కొన్న కార్పొరేట్ రాజ‌కీయాల వైపే వారుమొగ్గు చూపుతున్నారు. ఆర్థిక భ‌రోసా, రాజ‌కీయ అండ‌దండ ‌లు.. ముఖ్యంగా మీడియాలో పాపులారిటీ కోసం.. ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టులు పాకులాడే వారు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం వీటినే ప్ర‌ధాన అజెండాగా చేసుందుకు కామ్రేడ్లు ముందుకు సాగుతున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న పెట్టి.. సంచ‌ల‌నాల‌కు వేదిక‌లుగా మారుతున్నారు. అంతేకాదు.. ఒక‌ప్పుడు కార్పొరేట్ గుత్తాధిప త్యాన్ని వ్య‌తిరేకించిన కామ్రేడ్లు.. ఇప్పుడు దేశంలో రైతాంగం.. ఈ విధానంపైనే పోరాడుతున్నా.. పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

గ‌డిచిన 19 రోజులుగా దేశ రాజ‌ధాని డిల్లీలో రైత‌న్న‌లు.. ఉద్యమం చేస్తున్నారు. వీరికి సంఘీభావం ప్ర‌క‌టించిన క‌మ్యూనిస్టులు..త‌ర్వాత ఎమ‌య్యారో.. ఎక్క‌డ ఉన్నారో కూడా తెలియ‌డం లేదు. దీనినే కొంత లోతుగా విశ్లేషించిన ప‌రిశీల‌కులు.. ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. కార్పొరేట్ల నుంచి నిధుల సేక‌ర‌ణ‌లో ఇత‌ర పార్టీల‌కు స‌మానంగా.. క‌మ్యూనిస్టులు పోటీ ప‌డుతున్నార‌ని.. వారి వ్యాపారాల్లోనూ (ప్ర‌ధానంగా మీడియా) కార్పొరేట్ పెట్టుబ‌డిదారుల‌కు పెద్ద‌పీట వేస్తున్నార‌ని.. అందుకే .. ప్ర‌జాస‌మ‌స్య‌ల గురించి ప‌ట్టించుకోవ‌డం దాదాపు మానేశార‌ని అంటున్నారు. త్వ‌ర‌లో ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల నిధుల వేట‌లో ఉన్న క‌మ్యూనిస్టులు.. కార్పొరేట్ శ‌క్తుల‌కు అనుకూలంగా మారాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. కామ్రెడ్లు ఈ సిద్ధాంతాన్నే అవ‌లంబిస్తే.. రాబోయే రోజుల్లో ఎర్ర‌జెండాలు క‌నిపించేనా?  అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌! మ‌రి ఏం జ‌రుగుతుందో చూద్దాం.
Tags:    

Similar News