అధికారం చేతిలో ఉన్నప్పుడు నేతల మధ్య పదవుల అలక ఎక్కువగా ఉంటుంది. ఆశించే వారు ఎక్కువ.. ఉండే పదవులు తక్కువ అన్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఎవరికి.. ఎప్పుడు.. ఏ పదవులు ఇవ్వాలన్న దానిపై అధినేత తీసుకునే నిర్ణయాలు చాలా అంశాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకే నియోజకవర్గానికి చెందిన పలువురు నేతల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు పలు సందర్భాల్లో విమర్శలకు కారణమవుతోంది.
అలాంటి వాటిల్లో ప్రకాశం జిల్లా చీరాల పేరు తరచూ వినిపిస్తూఉంటుంది.ఇక్కడ అధికార పార్టీకి ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. వారిలో ఒకరు ఆమంచి క్రిష్ణ మోహన్ కాగా.. ఒకప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న పోతుల సునీత.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు.. టీడీపీలో ఉన్నప్పుడు తాను పొందిన ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఇదిలా ఉంటే.. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీరాలలో గెలిచిన టీడీపీ అభ్యర్థి కరణం బలరాం కూడా తర్వాతి కాలంలో అధికారపార్టీలోకి చేరటంతో.. ఈ ముగ్గురు నేతల మధ్య అధిపత్య పోరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది.
ఇలాంటి వేళ.. తాజాగా ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీతను ఎంపిక చేయటమే కాదు.. పార్టీ బీ ఫారంను సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా అందించారు. దీంతో.. ఆమెను ఎమ్మెల్సీగా ఎంపికైనట్లుగా చెప్పాలి. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మూడు నెలలకే మళ్లీ అదే పదవికి సునీతను ఎంపిక చేయటం ద్వారా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి.
ఇటీవల ఎమ్మెల్యే కరణం బలరాంకు.. పోతుల సునీత మధ్య బహిరంగంగానే గొడవ జరిగింది. 2024లో కూడా కరణం బలరాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ప్రకటించిన తీరుపై పోతుల మండిపడ్డారు. ఇరు పక్షాల వారు తిట్టుకున్న పరిస్థితి. ఇలాంటి వాటికి చెక్ చెప్పాలని భావించిన జగన్.. తాజాగా ఆమెను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. దీంతో.. 2024లో ఆమెను ఎమ్మెల్యే రేసు నుంచి పక్కకు తప్పించారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమంచికి సంబంధించిన సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది కూడా పూర్తి అయితే.. చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీకి ఉన్న పెద్ద తలనొప్పి తీరినట్లుగా చెప్పక తప్పదు.