చంద్రబాబు, లోకేష్ వద్దు.. జూ.ఎన్టీఆర్ ముద్దు.. ఈ కొత్త నినాదమా?

Update: 2021-03-04 17:30 GMT
'చంద్రబాబు లోకేష్ వద్దు.. జూనియర్ ఎన్టీఆర్ ముద్దు' తెలుగు తమ్ముళ్లు చేస్తున్న కొత్త నినాదమట. ఇదే ఇప్పుడు టీడీపీ తమ్ముళ్ల నోట ఇదే వినిపిస్తోందట.. చంద్రబాబు, లోకేష్ లపై టీడీపీ క్యాడర్ లో ఎందుకు వైరాగ్యం వచ్చింది.? జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ ఎందుకు చేస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీడీపీలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ తిరిగి రావాలనే  చర్చ జరుగుతోందట.. గత 607 సార్లు చంద్రబాబు కుప్పంలో పర్యటించినా ఏనాడు జూనియర్ ఎన్టీఆర్ పేరు ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజల నోటి వెంట రాలేదు. కానీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వచ్చింది. కుప్పంలో ఏ ఇద్దరు కలిసినా నాయకత్వ మార్పు గురించే చర్చ జరుగుతోందట..

ఇటీవల కుప్పంలో టీడీపీ పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కుప్పం వెళితే ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయంట.. చంద్రబాబు, లోకేష్ ను  ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదట.. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోనే ఉన్నట్టుగా ఆయన ఫ్లెక్సీలు  పెద్ద ఎత్తున దర్శనమివ్వడం అక్కడ ప్రజల్లో చర్చనీయాంశమైంది.

చంద్రబాబు పుట్టిన రాయలసీమ లోనే  ఇలా ఉంటే కోస్తాలో, ఉత్తరాంధ్రలో బలమైన సినీ అభిమానం ఉండే చోట ఇంకా ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినపడుతుందని.. చంద్రబాబు లోకేష్ లు ఇద్దరూ భయపడుతున్నారని టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు వయసు అయిపోయిందని.. లోకేష్ కు యూత్ ఫాలోయింగ్ లేదు అని అందుకే జూనియర్ ఎన్టీఆర్ రావాలనే కొత్త డిమాండ్ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో సాగుతోంది.
Tags:    

Similar News