ఫోటోను చూసినంతనే ఆధార్ కార్డు అనుకోవటం ఖాయం. కానీ.. అది అసలు సిసలు ఆధార్ కార్డు కాదు. సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లుగా.. వినూత్నంగా ఏదో ఒకటి చేయాలనుకున్న ఒక జంట వెరైటీగా ట్రై చేసి సక్సెస్ కావటమే కాదు.. సోషల్ మీడియాలో వీరి ఆలోచనను పలువురు మెచ్చుకుంటున్నారు. సరదాగా చేసిన తమ ప్రయత్నానికి ఇంత భారీగా గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని ఊహించని ఈ జంట సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతకూ ఈ వెరైటీ ఆధార్ కార్డు స్పెషల్ ఏమిటి? అసలు దీన్ని ఎందుకిలా తయారు చేశారు? అన్న విషయంలోకి వెళితే..
పెళ్లి వేళ.. ఏదైనా వెరైటీగా చేయాలని తపించే వారు తక్కువేం కాదు. సరిగ్గా అలానే ఆలోచించిన బెంగాలీ జంట వినూత్నంగా ప్లాన్ చేశారు. తమ పెళ్లి వేడుకకు సందర్భంగా హాజరయ్యే అతిధులకు వడ్డించే మెనూను ఆధార్ కార్డు నమూనాలో ప్రింట్ చేయించారు.
దీంతో.. ఇది కాస్తా ప్రత్యేకంగా మారి.. సోషల్ మీడియాలో ఇదోవైరల్ గా మారింది. కోల్ కతాకు చెందిన గొగోల్ సాహా.. సుబర్న దాస్ లు ఫిబ్రవరి ఒకటిన పెళ్లి చేసుకున్నారు. వీరి వెడ్డింగ్ సందర్భంగా ఒక మెనూ కార్డును ఏర్పాటు చేశారు. ఇది చూసేందుకు ఆధార్ కార్డు మాదిరే ఉంటుంది. దీన్ని గుర్తించిన ఒకరు ఫేస్ బుక్ లో పోస్టు చేయటం.. అది వైరల్ గా మారటంతో.. ఈ కార్డు వెనుక కథ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
ఆధార్ కార్డు నమూనాలో తమ ఫుడ్ వెడ్డింగ్ కార్డు ఉండటంపై పెళ్లికుమారుడు సాహా స్పందించారు. తాను.. తన భార్య డిజిటల్ ఇండియాను సమర్థిస్తామని.. తన భార్యకు వచ్చిన ఆలోచనతోనే ఈ ఫుడ్ వెడ్డింగ్ మెనూను సిద్ధం చేయించినట్లు చెబుతున్నారు. దీనికి ఇంతటి పేరు వస్తుందని తాము అస్సలు ఊహించలేదంటూ సంతోషంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిజిటల్ ఇండియాకు మద్దతుగా తామీ పని చేసినట్లు చెప్పారు. పెళ్లికి వచ్చిన వారు ఈ కార్డును చూసి ఆశ్చర్యపోయారని.. వినూత్నంగా ఉందని మెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ ఐడియాను పలువురు వాడేయటం ఖాయం.