మృగశిర కార్తె పేరు వినగానే ప్రతి మదిలో మెదిలేది చేపలు. ఈ కార్తె ప్రారంభమైన రోజు చేపలు తినడం అనేది ఆనవాయితీగా వస్తోంది. మృగశిర కార్తె రాగానే చేపలు తినాలని మార్కెట్కు పరుగు తీసి వంటింట్లో కుస్తీ పట్టి ఆత్మ రాముణ్ని చేపల కూర తో తృప్తి పరచడం కాదు. అసలు ఈ కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి..? పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తోందని గుడ్డిగా ఫాలో అయిపోవడం కాదు. ఈ కార్తెలో చేపలు ఎందుకు తినాలనే దానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..?
ఇవాళ్టి నుంచి మృగశిర కార్తె ప్రారంభం అయింది. ఏ ఇంట్లో చూసినా కమ్మగా చేపల వాసన వస్తోంది. ఎవరిని భోజనం చేశారా అని అడిగినా.. హా చేపల కూరతో తృప్తి గా లాగించేశామనే చెబుతున్నారు. అసలు కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి? దీని వెనుక ఓ రహస్యం ఉంది. రోళ్లు పగిలే ఎండలు తీసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసి.. చిరుజల్లులతో స్వాగతం పలికే మృగశిర కార్తె మొదలవ్వగానే ప్రకృతితో పాటు మన శరీరం లోనూ చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.
గ్రీష్మ రుతువులో భానుడి భగభగలకు అల్లాడిపోయిన ప్రజలు మృగశిర కార్తె మొదలవగానే చిరుజల్లుల్లో తడిసి ముద్దవుతారు. కానీ అప్పటి వరకు వారి శరీరంలో ఉండే ఉష్ణోగ్రతలు మృగశిర రాగానే.. తగ్గిపోతాయి. మరోవైపు వానల వల్ల రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయి. ఫలితంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే ఈ కార్తెలో చేపలు తింటారు. చేపలు తినడం వల్ల మృగశిర కార్తెలో సంక్రమించే వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని ఓ నమ్మకం. ఇది శాస్త్రీయం గానూ నిరూపితమైంది. అందుకే మృగశిర కార్తె రాగానే శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి.. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చేపలు తింటారు.
చేపలు తినడం వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి తినడం వల్ల గుండె, ఆస్తమా, మధుమేహం వ్యాధి ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతంది. గర్భిణీలు కూడా చేపలు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. చేపలు తినని వారు ఈ కార్తెలో.. ఇంగువను బెల్లం లో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగు లో పెట్టుకుని తినేవారు. ఈ రోజు ఏ ఇంటా చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ఫ్రై చేసుకుని కచ్చితంగా తింటుంటారు.
చేపల్లో మాంసకృత్తులతో పాటు శరీరానికి మేలు చేసే కాల్షియం, పాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. చేపలు కొవ్వులు చాలా సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు. వీటిలో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనం పై మంచి ప్రభావం చూపుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. చేపలు తినడం వల్ల శరీరానికి బీ12 విటమిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, బయెటిక్, థయామిన్, విటమిన్ ఏ, డీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
తెలంగాణలో మృగశిర కార్తె రాగానే ఎక్కువగా కొర్ర మీను చేపలు తింటుంటారు. ఈ చేపల్లో ఉండే ఆమ్లం గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టించేలా ఉపయోగపడుతుంది. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున స్థానికంగా దొరికే పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.