ఔను.. ప్రజాస్వామ్య వాదులు.. మేధావులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయాలు ఎందుకు ఇంతగా దిగజారుతున్నాయనే ప్రశ్న వేస్తున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు .. ప్రతివిమర్శలు కామనే. కానీ, దీనికి మించి అన్నట్టుగా ఇప్పుడు ఏపీలో పరిస్థితి దిగజారిపోయింది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అణిచేయాలనే భావన అధికార పార్టీలో కనిపిస్తోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, అదే సమయంలో తమకు ఏ చిన్న అవకాశం వచ్చినా.. అధికారంలో ఉన్ననాయకులను దొంగలు గాను.. కూనీకోర్లు గానూ చూపించే ప్రయత్నం ప్రతిపక్షాల్లోనూ కనిపిస్తోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రెండు పరిణామాలు కూడా ఇరుపక్షాలకు అంత మంచిది కాదని చెబుతున్నారు. అసలు ప్రజా స్వామ్యంలో రెండు ఉంటేనే కదా.. ప్రజలకు మేలు జరిగేది? అని చెబుతున్నారు.
ప్రతి విషయంలోనూ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం.. ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా మా ర్చుకునే ప్రయత్నం ప్రతిపక్షాలు చేయడం.. వంటివి సరికాదని అంటున్నారు. ప్రజాస్వామ్య యుతంగా ఎవరు ఎవరి పైనైనా విమర్శలు చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్య యుతంగా ప్రజల మధ్యకు కూడా వెళ్లొచ్చు. కానీ, ఇవేవీ కాకుండా. వ్యక్తిగత కక్షలు.. నిందలు.. ఆరోపణలతో ఎన్నాళ్లు పొద్దు పుచ్చుతారు? అనేది వీరి ప్రశ్న.
ఇదేసమయాన్ని కలసి కట్టుగా .. ఏపీ ఎదుర్కొంటున్న కామన్ సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం, ఉక్కు ఫ్యాక్టరీ.. విభజన సమస్యలు.. జీఎస్టీ ఇలా.. లెక్కకు మిక్కిలిగా అనేక సమస్యలు ఉండగా.. వాటిపై పోరాడి ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేయడం మానేసి.. ఇలా వ్యవహరించడం ఏంటనేది మేధావుల మాట. మరి దీనిపై ఎవరు స్పందిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.