సుప్రీంకోర్టులో ఎప్పుడో జరిగిపోయిన రాష్ట్ర విభజనపై ఇంకా విచారణ జరుగుతోంది . 2014లో సమైక్య రాష్టాన్ని విడగొట్టి అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణా, ఏపీ గా ప్రకటించారు. అప్పటినుండి రెండు ఎన్నికలు కూడా జరిగిపోయాయి. మూడో ఎన్నిక జరగటానికి షెడ్యూల్ దగ్గరకు వస్తోంది. అయినా అప్పుడెప్పుడో జరిగిపోయిన రాష్ట్ర విభజనపై విచారించి ఏమిటి ఉపయోగం ? మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్ ప్రకారమే సుప్రీంకోర్టు కేసును విచారిస్తోంది.
రాష్ట్ర విభజన అసలు జరగనేలేదని ఉండవల్లి వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అనుసరించాల్సిన నిబంధనలను అనుసరించలేదని, పైగా ఉల్లంఘించిందని ఉండవల్లి వాదన. విభజన పై అప్పటి స్పీకర్ అసలు ఓటింగే నిర్వహించకుండానే విభజన జరిగిపోయినట్లు ప్రకటించారన్నది ఉండవల్లి ఆరోపణ.
విభజన జరిగినపుడు అన్ని నిబంధనలను యూపీఏ ప్రభుత్వం ఉల్లంఘించిందనే అనుకుందాం. విభజన చట్టవిరుద్ధంగా జరిగిందన్నది నిజమే అనుకుందాం. అయితే అప్పటి కాంగ్రెస్, బీజేపీలు ఏకమైపోవటంతో అడ్డుగోలుగానే రాష్ట్ర విభజన జరిగిపోయిందన్నది వాస్తవం.
అప్పట్లో జరిగిపోయిన విభజనపై కేసు విచారించటం వల్ల ఇపుడు ఏమిటి ఉపయోగం ? విభజన చట్టబద్దంగా జరగలేదని సుప్రింకోర్టు కూడా ఏకీభవించిందనే అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది ? విభజన సరిగా జరగలేదు కాబట్టి మళ్ళీ రెండు రాష్ట్రాలను ఏకం చేసేయాలని సుప్రింకోర్టు తీర్పు చెప్పగలదా ? అలా చెప్పే తీర్పు ఆమోదయోగ్యమేనా ?
అధికారికంగా విభజనను కేంద్రం ప్రకటించక ముందే కొందరు సుప్రింకోర్టులో కేసువేశారు. అప్పుడేమో విభజన జరగనపుడు ఆందోళన ఎందుకని ఇదే సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది. కేసును విచారించేందుకు అంగీకరించలేదు. విభజన జరిగిపోయి రెండు ఎన్నికలు అయిపోయిన ఈ పరిస్ధితుల్లో విభజన కేసును విచారిస్తే ఏమిటి లాభమో ఎవరికీ అర్ధంకావటంలేదు.
విభజన సరిగా జరగలేదని సుప్రింకోర్టు అంగీకరించటమే ఉండవల్లికి కావాల్సిందా ? దానివల్ల ఇపుడు ఉండవల్లికి వచ్చే లాభంఏమిటి ? అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఏకమైపోతే రాష్ట్రాన్ని ఎంత అడ్డుగోలుగా విడదీయచ్చనేందుకు సమైక్య రాష్ట్ర విభజనే పెద్ద ఉదాహరణ.