ఒకడేమో పిల్లిని ఉరి తీసి వినోదం చూస్తాడు.. ఇంకొకడు లాక్ చేసిన కారు అద్దం ఓపెన్ చేసి దాన్ని కొట్టేయడం ఎలాగో చేసి చూపిస్తాడు. ఇంకొకడు తన ప్రేమను కాదన్న అమ్మాయిపై యాసిడ్ పోస్తే తన ముఖం కాలిపోయినట్లుగా చూపించే వీడియో పెడతాడు.. ఇంకో అమ్మాయి అబ్బాయిల బ్లాక్ మెయిలింగ్‌కు భయపడి ఏడుస్తూ జాకెట్ విప్పుతున్న వీడియోను షేర్ చేస్తుంది. ఒక కుర్రాడు వెనుక నుంచి తన ఎద భాగాన్ని నొక్కితే టీనేజీ అమ్మాయి నవ్వుతుంటుంది. కొందరు ముస్లింలను తిట్టి పోస్తారు. మరికొందరు హిందువులపై విషం చిమ్ముతారు.. కులాల ప్రమోషన్లు, వేరే కులంపై దూషణలు.. ఇలా టిక్ టాక్‌లో ఎన్నో దారుణమైన వీడియోలు చూస్తున్నాం. బయటికి తెలియకపోవచ్చు కానీ.. టిక్ టాక్ కారణంగా ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయన్నది పరిశీలకుల మాట.
అన్నిటికీ మించి టిక్ టాక్ యాప్ చైనా వాళ్లు తయారు చేసింది. ఈ యాప్ ద్వారా మన డేటానంతా చైనా వాడు సేకరిస్తున్నాడన్నది కేవలం ఆరోపణ కాదు. నిజం. దీని వల్ల ఎలాంటి విపరిణామాలైనా తలెత్త వచ్చు. ఈ యాప్ వల్ల ఒక జనరేషన్ మొత్తం తప్పుదోవ పడుతోందని.. పిల్లలు దీనికి బానిసలుగా మారిపోయి చిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. సమాజంపై ఇది చెడు ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు.
ఈ యాప్ ను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కొంత కాలంగా వినిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఐతే టిక్ టాక్ రోజు రోజుకూ ఓ వ్యసనంలా మారి యువతను పెడదోవ పట్టిస్తున్న నేపథ్యంలో సొసైటీలో ఒక కదలిక వచ్చినట్లే ఉంది. మొన్నటిదాకా 4 ప్లస్ రేటింగ్ తో ఉన్న ఈ యాప్ కు ఇప్పుడు ప్లే స్టోర్ లో 2 రేటింగ్ కనిపిస్తోంది. అలాగే ట్విట్టర్లో ‘బ్యాన్ టిక్ టాక్ ఇన్ ఇండియా’ హ్యాష్ ట్యాగ్ ఈ రోజు టాప్ లో ట్రెండ్ అవుతోంది.